కొరాపుట్: పశ్చిమ ఒడిశా మొదటి పండగ నువాఖాయ్ గురువరాం ప్రారంభమైంది. నబరంగ్‌పూర్ జిల్లా చందాహండి, రాయిఘర్ సమితుల్లో గిరిజనులు తమ ప్రథమ పండగను ఘనంగా నిర్వహించారు. ఈ విడత పండిన తొలి ధాన్యంతో భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. గిరిజనులు తమ ఇంటి, గ్రామ దేవతలకు తమ తొలి పంటని నైవేద్యంగా పెట్టి వంటకాలు చేసుకున్నారు. మాజీ మంత్రి రమేష్ చంద్ర మజ్జి, జొరిగాం మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ చంద్ర మజ్జి తమ స్వస్థలం చందాహండిలో వివిధ గ్రామల ప్రముఖులకు భోజనాలు ఏర్పాటు చేశారు. నబరంగ్‌పూర్ ఎంపీ బలభద్ర మజ్జి తన స్వగృహంలో ఇంటి దేవతకి పూజలు చేశారు. సమీప కలహండి జిల్లాలో మేక మాంసం విక్రయాలు జోరుగా జరిగాయి.


