పర్లాకిమిడి: పర్లాకిమిడి గజపతి స్టేడియం వద్ద ఈ నెల 17న సెంచూరియన్ పబ్లిక్ స్కూల్లో మొక్కలు నాటే కార్యక్రమం ఉదయం గం.10.30కు నిర్వహించనున్నట్టు జిల్లా అటవీ శాఖ కన్జర్వేటర్ శైనీశ్రీ దాస్ తెలిపారు. అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఎన్‌ఎఫ్‌ఐఆర్ జోనల్ కార్యదర్శిగా సుధీర్
భువనేశ్వర్: భారతీయ రైల్వే కార్మిక జాతీయ సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐఆర్) జోనల్ కార్యదర్శిగా సుధీర్ పాఢి నియమితులయ్యారు. ఈ నెల 11న న్యూఢిల్లీలో జరిగిన 244వ కార్యవర్గ సమావేశంలో ఈ నియామకం జరిగినట్లు ఖుర్దారోడ్ ఓపెన్ లైన్ శాఖ కార్యదర్శి లక్ష్మీధర మహంతి తెలిపారు. సుధీర్ పాఢి ప్రస్తుతం తూర్పు కోస్తా రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ ముఖ్య సలహాదారుగా బాధ్యతలు వహిస్తున్నారు. న్యూఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన సుధీర్‌కు ఖుర్దా రోడ్ రైల్వే స్టేషనులో ఘన స్వాగతం లభించింది. తూర్పు కోస్తా రైల్వే శ్రామిక్ కాంగ్రెసు ఖుర్దారోడ్ మండల సమన్వయకర్త సునీల్ కుమార్ భంజ్ ఆధ్వర్యంలో మండల స్థాయిలో 3 శాఖల కార్మిక నాయకులు ఎన్‌ఎఫ్‌ఐఆర్ జోనల్ కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా సుధీర్‌కి పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు.


