రాయగడ:
జేకేపూర్, చందిలి సమీపంలో గల నెహ్రునగర్‌లో నిర్వహిస్తున్న వినాయక ఉత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వాహకులు వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఉత్సవాల ప్రాంగణంలో అన్నదానం కార్యక్రమంతో పాటు వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక శ్రీక్షేత్ర టౌన్‌షిప్ అధినేత దూడల శ్రీనివాస్ హాజరై దుప్పట్లను పంపిణీ చేశారు. గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ నిర్వహిస్తున్న వినాయక ఉత్సవాల్లో భాగంగా ప్రతీ ఏడాది సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుండటం అభినందనీయమని శ్రీనివాస్ అన్నారు. సమాజ సేవయే లక్ష్యంగా ఈ ప్రాంత యువకులు ముందుకు రావడం హర్షించదగిన విషయమన్నారు. ఈ సందర్భంగా వృద్ధులు, పేదలకు 300 దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎస్.శివ, పి.విక్కీ, జగేంద్ర, అధికారి అజయ్ కుమార్, సూరి సంతోష్ కుమార్, తదితరులు నిర్వహించారు.


