చందా వసూలుపై తగాదా.. మిఠాయి దుకాణం ధ్వంసం..! | - | Sakshi
Sakshi News home page

చందా వసూలుపై తగాదా.. మిఠాయి దుకాణం ధ్వంసం..!

Sep 16 2026 3:19 AM | Updated on Sep 16 2026 3:19 AM

జయపురం: జయపురంలో గణేశ్‌ పూజ సందర్భంగా చందాలు వసూలుపై గొడవ జరిగింది. పట్టణ ప్రధాన మార్గంలో భాస్కర్‌ టాకీస్‌ సమీపంలో ఓ మిఠాయి దుకాణానికి కొంత మంది వచ్చి గణేశ్‌ పూజ కోసం చందా అడిగారు. ఈ నేపథ్యంలో ఇరువురుకి వివాదం ఏర్పడింది. చందాకు వచ్చినవారు ఆ వ్యాపారిని కొట్టి దుకాణాన్ని ధ్వంసం చేశారని ఆరోపణ. బాధితుని ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు వచ్చి దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ సంఘటనపై పట్టణ ప్రజలు చర్చించికుంటున్నారు. పండగల కోసం చందాలు వసూలు చేయటం అనాదిగా వస్తున్నంని, అంతమాత్రాన బలవంతపు వసూలు చేయకూడదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎవరైనా ఉత్సవాలకు స్వయంగా చందాలు ఇస్తే ఇబ్బంది ఉండదని, చందాలు ఇవ్వకపోతే వారిపై దౌర్జన్యం చేయటం, కొట్టటం, దుకాణాలు ధ్వంసం చేయటం మంచిది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. జబర్దస్తీగా చందాలు వసూలు చేయడం నేరమని, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవటం న్యాయమన్నారు. అలా చేస్తే భవిష్యత్‌లో ఇటువంటి సంఘటనలు పునరావృత్తం కావని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. వ్యపారిని కొట్టి మిఠాయి దుకాణం ధ్వంసం చేసిన సంఘటనలో బాధితునికి జయపురం చాంబర్‌ ఆఫ్‌ కామర్ష్‌ ఇండస్ట్రీస్‌ సభ్యుడు రూ.5000 ఆర్థిక సహాయం అందజేశాడు. ధ్వంసమైన షాపును బాగుచేయించుకొని, తిరిగి వ్యాపారం చేసుకునేందు ఆర్థిక సహాయం చాంబర్‌ అధ్యక్ష, కార్యదర్శుల సమక్షంలో అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement