మోసం కేసులో ఇద్దరు అరెస్టు | - | Sakshi
Sakshi News home page

మోసం కేసులో ఇద్దరు అరెస్టు

Sep 16 2026 3:19 AM | Updated on Sep 16 2026 3:19 AM

జయపురం: ఒక ట్రక్కు డ్రైవర్‌ను మోసగించి డబ్బు దోచుకున్న కేసులో జయపురం పట్టణ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి ఉల్లాస్‌ చంధ్ర రౌత్‌ నేడు వెల్లడించారు. వారి నుండి రూ.30వేలు రెడు మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అరెస్టయిన వ్యక్తులు గొడొపొదర్‌ గ్రామం హరిజన్‌ వీధి గోల్ప్టు షేక్‌ ఉరఫ్‌ గౌరంగ్‌ (24)పేపరుమిల్లు ప్రాంత సి.హెచ్‌. క్రాంతి(20)లు అని వెల్లడించారు. పోలీసు అధికారి వివరణ ప్రకారం మహారాష్ట్రకు చెందిన ఒక ట్రక్కు డ్రైవర్‌ భువనేశ్వర్‌ నుంచి విశాఖపట్నం వెళ్తున్న సమయంలో జయపురం సమీపంలో అతడి ట్రక్కు పాడయ్యింది. ఈ ప్రాంతం పై ఎలాంటి అవగాహన లేని డ్రైవర్‌ ట్రక్కు మరమ్మతు ఎక్కుడ చేస్తారని అతడికి కనిపించిన గోల్పు షేక్‌ ఉరఫ్‌ గౌరంగ్‌ అనే యువకుని సహాయం అడిగాడు. గౌరంగ్‌ డ్రైవర్‌ను రెండు మూడు గేరేజ్‌ లకు తిప్పి భోజన ఖర్చులు, ఇతర ఖర్చులు డ్రైవర్‌ తో పెట్టించి అతడు పే ఫోను ద్వారా డబ్బులు చెల్లించడం చూసి ఫోన్‌ పే నంబర్‌, పాస్‌వర్డ్‌ తెలుసుకున్నాడు. అనంతరం గౌరంగ్‌ తన మిత్రులైన మరో ముగ్గురిని పిలిచి డ్రైవర్ని తీవ్రంగా కొట్టి అతని మొబైల్‌ ఫోన్‌ లాక్కున్నారు. తర్వాత ఆ మొబైల్‌ ద్వారా దాదాపు రూ.90 వేలు తన అకౌంట్‌ కు ట్రాన్స్‌ఫర్‌ చేసుకుని పరారైపోయారు. ఘటనపై గత ఆగస్టు 14 వ తేదీన బాధిత డ్రైవర్‌ పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసు టీమ్‌ అనేక ప్రాంతాల్లో దర్యాప్తు జరిపి ఎట్టకేలకు గౌరంగ్‌, సి.హెచ్‌.క్రాంతి లను గుర్తించి పట్టుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement