కటక్ రైల్వే స్టేషన్‌లో ..
భువనేశ్వర్:
తూర్పు కోస్తా రైల్వే ఖుర్దా రోడ్ మండలం పరిధిలోని కటక్ రైల్వే స్టేషన్‌లో పునరాభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో 2 మెమూ రైలు సేవలను నియంత్రించనున్నట్లు తూర్పు కోస్తా రైల్వే ప్రకటించింది. ఈ ఉత్తర్వుల ప్రకారం కటక్ వరకు రాకపోకలు చేయాల్సిన మెమూ రైళ్ల సేవలను మంచేశ్వర్ రైల్వే స్టేషన్ వరకు పరిమితం చేయనున్నట్లు పేర్కొన్నారు. రైల్వే శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం 68434 గుణుపూర్ – కటక్ మెమూ రైలు సేవలు ఈ నెల 8 నుంచి అక్టోబర్ 7 వరకు కటక్ గమ్యం చేరకుండా మంచేశ్వర్ వరకేయ పరిమితం అవుతాయి. ఈ వ్యవధిలో తిరుగు ప్రయాణంలో 68433 కటక్ – గుణుపూర్ మెమూ రైలు ఇదే కాలంలో కటక్ బదులుగా మంచేశ్వర్ రైల్వే స్టేషను నుంచి ప్రారంభమై గుణుపూర్ వెళ్తుంది. ఫలితంగా కటక్, గుణుపురం మధ్య రవాణా చేయాల్సిన 68434/68433 రెండు మెమూ రైళ్ల సేవలు మంచేశ్వర్, కటక్ స్టేషన్ల మధ్య తాత్కాలికంగా రద్దు చేశారు. తాజా రైలు సమాచారం కోసం ప్రయాణికులు అధికారిక రైల్వే తాజా సమాచారం కోసం నేషనల్ ట్రైన్ ఎంకై ్వరీ సిస్టమ్ (ఎన్‌టీఈఎస్)ను సందర్శించాలని రైల్వే అధికార వర్గాలు పేర్కొన్నాయి.


