● 22 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
రాయగడ: జిల్లా పోలీసులు అంతర్ జిల్లా వాహన దొంగతనాల ముఠా గుట్టురట్టు చేశారు. వివిధ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 22 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా కు సంబంధించి రాయగడ, గుడారి, పద్మపూర్, గుణుపూర్, పార్వతీపురం టౌన్, రామనగుడ పోలీస్ స్టేషన్ల పరిధిలొ నమోదైన 8 వాహన చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. ఎస్పీ రాజ్ ప్రసాద్ ఈ మేరకు ఆదివారం నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం నాడు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వివిధ ప్రాంతాల్లో ద్విచక్రవాహనాల చోరీ గ్యాంగ్ ను పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. దీనికి సంబంఽధించి 22 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఆయన చెప్పారు. అరెస్టయిన వారిలో చందిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గువాకొన గ్రామానికి చెందిన సింహాచల్ మహానందియా, ప్రదీప్ చండి బంశ, ఉతకాపాడు గ్రామానికి చెందిన రాజేశ్వర్ నాగవంశీలు ఉన్నారు.
ఇలా సాగింది..
నిందితులు బజాజ్ మ్యాక్సిమా మెగా ఆటోలో తిరుగుతూ వాహనాలు నిలిపే ప్రాంతాలను ముందుగా పరిశీలించేవారని ఎస్పీ రాజ్ ప్రసాద్ చెప్పారు. ఈ క్రమంలో అనుకూలమైన ప్రాంతాలను గుర్తించిన అనంతరం ద్విచక్ర వాహనాలను చోరీ చేసి, వాటిని తమ ఇళ్ల వెనుక లేదా ఇతర రహస్య ప్రాంతాల్లొ దాచేవారు. ఈ ముఠా పలు ప్రాంతాల్లో వ్యవస్థీకృతంగా కార్యకలాపాలు సాగించినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఆయన వివరించారు. పార్వతీపురం, గుణుపూర్, గుడారి ,కెందుగుడ, మునిగుడ, రామనగుడ, రాయగడ, గుమడ ప్రాంతాల్లో నిందితులు సంచరిస్తున్నట్లు పోలీసుల బృందం గుర్తించింది. అనంతరం వ్యూహాత్మక దాడులు నిర్వహించి నిందితులను పట్టుకుని వారి నుంచి వాహనాలను స్వాధీ నం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. అనంతరం వా హనాల యజమానులకు తిరిగి స్వాధీనం చేసుకున్న వాహనాలను అందజేశారు.


