మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లాలోని ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల నియామకం, ఆధునిక పరికరాలను సమకూర్చాలని మల్కన్‌గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మడ్కామి కోరారు. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రిని భువనేశ్వర్‌లో శనివారం కలిసి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ వ్యవహరాలు,ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి ముకేశ్ మహలింగ ఇంట్లో ఆరోగ్యశాఖ మంత్రిని మల్కన్‌గిరి ఎమ్మెల్యే కలిసి నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించారు. ముఖ్యంగా అల్ట్రాసౌండ్ యంత్రం, డిజిటల్ ఎక్స్‌రే, సీహెచ్‌సీలో డయాలసిస్ నిపుణులైన వైద్యులను నియమించాలని కోరారు. అన్నీ సమకూర్చుతామని మంత్రులు హామీ ఇచ్చినట్టు ఎమ్మెల్యే పేర్కొన్నారు.


