చిత్తరంజన్‌ సహానికి గురు గౌరవ్‌ సమ్మాన్‌ | - | Sakshi
Sakshi News home page

చిత్తరంజన్‌ సహానికి గురు గౌరవ్‌ సమ్మాన్‌

Sep 7 2026 7:51 AM | Updated on Sep 7 2026 7:51 AM

భువనేశ్వర్‌: ఒడియా సాహిత్యంలో అగ్రగామిగా నిలిచి ఒడిస్సీ నృత్య రంగంలో అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రతిభను చాటుకుంటున్న డాక్టర్‌ చిత్తరంజన్‌ సహాని ప్రతిష్టాత్మక గురు గౌరవ్‌ సమ్మాన్‌ సత్కారం పొందారు. కటక్‌ నగరంలోని గౌరీ శంకర్‌ రాయ్‌ సమావేశం హాల్‌లో ఉత్కళ విద్యా గౌరవ పరిషత్‌ 8వ వార్షికోత్సవంలో భాగంగా పరమహంస స్వామీజీ బ్రహ్మానంద సరస్వతీ మహరాజ్‌ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక గురు గౌరవ్‌ సత్కారం పొందారు. దేశ, విదేశాలలో ఒడియా భాషా సాహిత్యాన్ని, ఒడిస్సీ నృత్యం ప్రోత్సహించడంలో డాక్టర్‌ చిత్తరంజన్‌ సహాని చేస్తున్న కృషిని కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు ప్రశంసించారు. ప్రాదేశిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో ఒకే వేదికపై ఒడియా సాహిత్యం, ఒడిస్సీ నృత్య ప్రదర్శన ప్రపంచ వ్యాప్తంగా భాష, సంస్కృతి, నృత్య కళా ప్రియుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. గత 3 దశాబ్దాలుగా పూరీలో జరిగే శ్రీజగన్నాథ మహా ప్రభువు గుండిచా యాత్ర, బహుదా యాత్ర, నీలాద్రి విజే, స్నాన యాత్ర, చందన్‌ యాత్ర, డోలా యాత్రవంటి ప్రముఖ ఉత్సవాలు, శ్రీజగన్నాథుని చివరి రెండు నవ కళేబర ఉత్సవాల సమయంలో డాక్టరు చిత్త రంజన్‌ సహాణి ఒడిస్సీ నృత్య ప్రదర్శనలు చేయడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement