వికసిత్‌ ఒడిశా వైపు అడుగులు | - | Sakshi
Sakshi News home page

వికసిత్‌ ఒడిశా వైపు అడుగులు

Aug 16 2026 6:21 AM | Updated on Aug 16 2026 6:21 AM

జిల్లా కలెక్టర్‌ అశుతోష్‌ కులకర్ణి

రాయగడ: రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది 2036 నాటికి వికసిత్‌ ఒడిశా వైపు అడుగులు వేసే దిశగా పయనిస్తోందని జిల్లా కలెక్టర్‌ అశుతోష్‌ కులకర్ణి అన్నారు. స్తానిక గోవింద చంద్రదేవ్‌ ఉన్నత పాఠశాల మైదానంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో శనివారం జరిగిన 80వ స్వాతంత్య్ర వేడుకలకు ఆయన ముఖ్యఅతిఽథిగా హాజరయ్యారు. ముందుగా కవాతుల గౌరవందనాన్ని స్వీకరించిన ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎంతో మంది త్యాగమూర్తుల ఫలమే మనకు స్వాతంత్య్రం సిద్ధించిందని గుర్తు చేశారు. జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది వికసిత్‌ ఒడిశాకు చేరువలొ తనవంతు కృషి చేస్తుందని ఆకాంక్షించారు. అనంతరం మైదానంలో వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వేడుకల్లో జిల్లా ఎస్పీ రాజ్‌ప్రసాద్‌, జిల్లాస్ధాయి అధికారులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, పట్టణ ప్రముఖులు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement