పర్లాకిమిడి: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం, మీడియా బృందం ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ శనివారం క్రిష్ణచంద్ర గజపతి కళాశాల మైదానంలో జరిగింది. జిల్లా యంత్రాంగం తరఫున ఎస్పీ ప్రహ్లాద్ సహాయ్ మీనా, ఏడీఎం ఫల్గునీ మఝి, ఐ.టి.డి.ఏ. పీఓ అంశుమాన్ మహాపాత్రో, డి ప్యూటీ కలెక్టర్ బినాయక్ రవుళో ప్రాతినిధ్యం వహించారు. తొలుత టాస్ గెలిచిన మీడియా బృందం నిర్ణీత 12 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 120 పరుగులు చేశారు. అనంతరం ఛేదనకు దిగిన జిల్లా అధికారులు 12 ఓవర్లలో 119 పరుగులు చేసి ఓటమి పాలయ్యారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ప్రభుత్వ ఉద్యోగి సంతోష్ నిలిచారు. విజేత జట్టుకు ఎస్పీ మీనా, పీఓ బహుమతులు అందజేశారు.


