వజ్రపుకొత్తూరు రూరల్: అక్రమ కేసులో అరైస్తె బెయిల్‌పై విడుదలైన మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజును ఎచ్చెర్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ కాశీబుగ్గలోని నివాసంలో శనివారం పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కిరణ్‌కుమార్ మాట్లాడుతూ.. రాజకీయ కక్షసాధింపులతో తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా అరెస్టులు చేయడం దారుణమన్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తున్న వారిని అణగదొక్కి వారి గొంతు నొక్కేందుకు ప్రభుత్వం శతవిధాల ప్రయత్నాలు చేస్తుందని మండిపడ్డారు. పోలీసు వ్యవస్థను, చట్టాన్ని స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం సిగ్గుచేటన్నారు. పరామర్శలో రణస్థలం మండల వైఎస్సార్‌సీపీ నాయకులు గొర్లె శ్రీనివాసరావు, డోల రమణ, ఎచ్చెర్ల నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు మజ్జి రమేష్, మాజీ సర్పంచ్ ఎం.జనార్దనరెడ్డి, బి.సూరి ఉన్నారు.


