మల్కన్‌గిరి: జిల్లాలోని మత్తిలి సమితి చౌలమెండి గ్రామంలో శుక్రవారం ప్రియుడి ముందు ఒక మహిళ ధర్నా చేపట్టింది. వివరాల్లోకి వెళ్తే.. బాధిత మహిళ, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇద్దరు కూడా వివాహితులు. అయితే వివా హం చేసుకుంటానని సదరు వ్యక్తి మహిళతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఇటీవల తనను మోసం చేస్తున్నాడని మహిళ తెలుసుకొని, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. దీంతో ఇటీవల బెయిల్‌పై బయటకు రావడంతో.. తనను పెళ్లి చేసుకోవాలని కోరుతూ ధర్నా చేపట్టింది.
మొక్కలు పరిశీలన
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా అటవీ విభాగ అధికారి సాయికిరణ్ డీఎన్ జిల్లాలోని చిత్రకొండ సమితి రేంజ్ పరిధిలో వనమహోత్సవంలో భాగంగా జరుగుతున్న పనులను శుక్రవారం పరిశీలించారు. పనుల్లో నాణ్యతను కచ్చితంగా పాటించాలని, నిర్ణీత గడువులోపు అన్ని పనులు పూర్తి చేయాలని క్షేత్రస్థాయి అటవీ సిబ్బందికి ఆదేశించారు. వృక్షారోపణ కార్యక్రమంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ప్రతి మొక్కను సక్రమంగా నాటడం, వాటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పలువురు రేంజ్ సిబ్బంది ఉన్నారు.
అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న ట్రాక్టర్ పట్టివేత
● ఒకరు అరెస్టు
మల్కర్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల పోలీసులు అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను శుక్రవారం ఉదయం పట్టుకున్నారు. ఈ ఘటనలో ఒకరిని అరెస్టు చేశారు. కలిమెల పోలీసుస్టేషన్‌కు సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎంపీవీ–33 గ్రామ సమీపంలో తనిఖీలు నిర్వహిస్తుండగా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టుబడింది. దీంతో దాన్ని సాధ్వీనం చేసుకోవడంతోపాటు గిర్కనపల్లి గ్రామానికి చెందిన విష్ణు ఝరాబాలాను అరెస్టు చేశారు. ట్రాక్టర్ ట్రాలీతో పాటు ఇసుక విలువ సుమారు ఐదు లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. కాగాా ట్రాక్టర్‌కు సంబంధించి నంబర్ ప్లేట్ ఉండాల్సిన చోట పెద్ద అక్షరాలతో ప్రెస్ అని రాసి ఉండటం చర్చనీయాంశమైది. జర్నలిస్టుల పేరును దుర్వినియోగం చేస్తూ వాహనాలపై ప్రెస్ అని రాసుకుని అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు పట్టణంలో వినిపిస్తున్నాయి.
అభివృద్ధి పనులపై
కలెక్టర్ సమీక్ష
రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి కొడింగిమాలి గనుల ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి పనులను కలెక్టర్ అశుతొష్ కులకర్ణి గురువారం పరిశీలించారు. కంసారిగుడ, కదాపదర్, మండాగం, నువాసాహి, అండుగుడ గ్రామాల్లో పర్యటించి గ్రామస్తులతో మాట్లాడి సంక్షేమ పథకాల అమలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు సబ్ కలక్టర్ రమేష్ కుమార్ జెన్న, ఐటీడీఏ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ చంద్రకాంత్ మాఝి, కాసీపూర్ బీడీఓ, తహసీల్దార్లు పాల్గొన్నారు.


