గిరిజన ఆశ్రమంలో
● విద్యా మంత్రి సొంత నియోజకవర్గంలో ఘటన
● విపక్షాల ఆందోళన
● ఘటనపై అనుమానాలు
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లాలో మరో ఆశ్రమ విద్యార్థిని తుది శ్వాస విడిచింది. జిల్లాలో ఉమ్మర్‌కోట్ సమితి బట్టిబెడ గ్రామంలో ప్రభుత్వ గిరిజన ఆశ్రమంలో 8వ తరగతి చదువుతున్న జబా శాంత (12) సమీప హస్టల్ పక్కనే ఉన్న చెట్టుకు మృతదేహమై వేలాడుతూ కనిపించింది. ముందు రోజు రాత్రి ముగ్గురు విద్యార్థినులు హాస్టల్ బయటకు వెళ్లి తిరిగి ఇద్దరు విద్యార్థినులు తిరిగి వచ్చారు. ఒక బాలిక అదృశ్యం కావడంతో హాస్టల్ సమీప ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో ఆమె మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించింది. వెంటనే హాస్టల్ వార్డెన్ ఉమ్మర్‌కోట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. బాలిక స్వగ్రామం సునాబెడా గ్రామ పంచాయతీ దొల్‌దలి. కుటుంబ సభ్యులు వచ్చి ఇది ఆత్మహత్య కాదని హత్య అని ఆరోపించారు. అనంతరం వారు కూడా ఉమ్మర్‌కోట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
మా ఘరో ఆగ్రహం
రాష్ట్రంలో మహిళల హక్కుల కోసం పోరాడుతున్న మా ఘరో సంస్థ కన్వీనర్ కాధంబనీ త్రిపాఠి ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతి పెద్ద ఎండి పోయిన చెట్టుని బాలిక ఎక్కడం సాధ్యం కాదన్నారు. ఇది ముమ్మాటికీ హత్య అని ఆరోపించారు. ఇప్పటికే జిల్లాలో చాలా మంది ప్రభుత్వ పాఠశా లలు, ఆఽశ్రమాలలో బాలలు అకాల మరణాలు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ మరణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం తక్షణ పరిహారం ప్రకటించాలని కాదంబని త్రిపాఠి డిమాండ్ చేశారు. ఆమె వెంట ప్రముఖ కాంగ్రెస్ నాయకురాలు హరావతి గొండో ఉన్నారు.
విపక్షాల ఆందోళన
ఈ ఘటన విషయం తెలిసిన వెంటనే బీజేడి చెందిన మాజీ మంత్రి రమేష్ చంద్ర మజ్జి, డీసీసీ అధ్యక్షురాలు డాక్టర్ లిఫికా మజ్జిల నేతృత్వంలో పార్టీల నాయకులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. విద్యా మంత్రి నిత్యానంద గొండో సొంత నియోజకవర్గంలో ఇలాంటి ఘటన జరగడంపై ఆగ్రహం


