మరమ్మతుకు లేవా నిధులు? | - | Sakshi
Sakshi News home page

మరమ్మతుకు లేవా నిధులు?

Jul 27 2026 2:24 AM | Updated on Jul 27 2026 2:24 AM

చరిత్రకు ఆనవాలు..

పర్లాకిమిడి: ప్రత్యేక ఉద్యమ రాష్ట్రానికి అహోరాత్రులు శ్రమించిన పర్లాకిమిడి ప్యాలెస్‌ పాలకుల నిర్లక్ష్యానికి గురవుతోంది. గజపతి వంశీయుల చారిత్రిక వైభవాన్ని చిహ్నాంగా నిలవాల్సిన కోట ఈరో జు జీర్ణావస్థ నుంచి కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. 180 ఏళ్ల కిందట యూరోపియన్‌ శైలిలో నిర్మించిన పర్లాకిమిడి గజపతి ప్యాలెస్‌ మరమ్మతుకు నేడు గజపతి వంశీయుల యువరాణి కళ్యాణీ దేవి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఒకప్పుడు ప్రత్యేకరాష్ట్రం కోసం ఉత్కళ హితేషినీ పేరిట ఉద్యమాలు ఇక్కడి నుండే అంకురార్పణ జరిగినవి. ఈరోజు కోటలో రాజా దర్బారు హాలు సీలింగు కూలిపోయి న స్థితిలో ఉంది. కొన్ని గదులు కూలిపోవడంతో కోట లోపలికి ఎవరినీ అనుమతించడం లేదు. కోట కు మరమ్మతులు చేసి సంగ్రహాలయంగా మార్చినా గజపతి వంశీయులకు రెవెన్యూ లభించేది.

ఇటీవల బహుడా రథయాత్ర రోజున పర్లాకిమిడి విచ్చేసిన రాష్ట్ర ఖనిజ రవాణాశాఖ మంత్రి బిభూతీ జెన్నా రాజావారి కోట, గజపతుల చిహ్నాం గురించి అనేక మందిని అడిగి తెలుసుకున్నారు. 1821– 1851లో జగన్నాథ గజపతి నారాయణ దేవ్‌ పరిపాలనకు వీలుగా పర్లాఖిముడిలో భారీ వ్యయంతో సుందరమైన కోట నిర్మించడానికి తల పెట్టారు. కోట నిర్మాణానికి అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వం రూ.24 లక్షల 20 వేలు గ్రాంటుగా అందజేశారు. తొలుత రూ.4 లక్షల50 వేలు బయానాగా ఇచ్చి బ్రిటిష్‌ ఆర్కి టెక్టు, ఇంజినీరు రాబర్టు ఫెల్లాస్‌ చెస్లామ్‌కు నిర్మాణ బాధ్యతను అప్పగించారు. 1835లో ఈ రాజకోట భవన నిర్మాణ పనులు ప్రారంభమై రెండు అంతస్థులు 80 గదులతో 1843 నాటికి కళ్లు చెదిరే రీతి లో నిర్మించారు. యూరోపియన్‌ మిశ్రమ వాస్తుకళతో నిర్మించిన ప్యాలస్‌ లండన్‌లోని బకింగ్‌హోమ్‌ ప్యాల స్‌కు సరితూగే విధంగా ఉంటుంది. దర్బారు హాలు వెనుక కల్యాణమండపం, పడగ గదులు, వంటగదులు, దాసీలు, పరిచాలకులకు ప్రత్యేకంగా మూడు వరుసల్లో గదులు నిర్మించారంటే అప్పటి రాజరిక

వ్యవస్థ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

పట్టించుకోని ప్రభుత్వాలు

రాచరిక వ్యవస్థ నుండి ప్రజాపాలకులు ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత జమీందారి వ్యవస్థ అంతరించిపోయింది. ఇప్పటి పాలకులు, ప్రభుత్వాలు చారిత్రాత్మక ప్రాచీన సంపదను కూడా కాపాడుకోలేకపోతున్నారు. అప్పటి ఎంపీ గోపినాధ గజపతి నారాయణ దేవ్‌ ఏనాడూ ఏ ప్రభుత్వాన్నీ ప్యాలస్‌ నిర్వహణ ఖర్చులకు నిధులు అడగలేదు. కానీ ఇప్పటి మంత్రులు ఈ ప్యాలెస్‌ను ప్రభుత్వానికి అప్పగిస్తే ఒక సంగ్రహాశాలగా మారుస్తామని అంటున్నారు. కొన్ని దశాబ్దాల క్రితం గోపీనాథ గజపతి నారాయణదేవ్‌ బృందావన ప్యాలస్‌ను ప్రభుత్వానికి అప్పగిస్తే అది ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదు. బీఎన్‌ ప్యాలస్‌ను యాంటీ నక్సల్‌ స్క్వాడ్‌ ఉండటానికి విడిదిగా వాడుకున్నారు. తర్వా త శ్రీకృష్ణచంద్ర గజపతి కళాశాల పీజీ క్లాసులు కొన్ని నెలలు నిర్వహించారు.

కొద్దినెలల కిందట ఒడిశా డిప్యూటీ సీఎం ప్రభాతీ పరిడా విచ్చేసి బీఎన్‌ ప్యాలస్‌ను అస్మితా ఒడియా ప్రతీకగా భవనాన్ని తీర్చుదిద్దుతామని ప్రకటించారు. కానీ ఇప్పటివరకూ ప్యాలస్‌ రూపు రేఖలే మారలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement