మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి స్వాభిమాన్ ఏరియా పాపరమేట్ల పోలీసులు ఆదివారం ఉదయం ఓ వ్యక్తి మృతదేహాన్ని చిత్రకొండ జలాశయంలో గుర్తించి అగ్నిమాపక సిబ్బంది సాయంతో వెలికి తీశారు. జలాశయంలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడని శనివారం పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో గాలించగా ఆదివారం మృతదేహం బాంగురుసుధా గ్రామం సమీపంలో బయటపడింది. మృతుడిని ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లా గూడెం పంచాయతీ మురళిగూడ గ్రామానికి చెందిన ప్రకాష్ ఖీల్(44) గా గుర్తించారు. మృతదేహానికి కాళ్లు, చేతులు కట్టేసి ఉండడం అనుమానాలకు తావిస్తోంది. మృతదేహన్ని చిత్రకొండ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని తెలిపారు.


