సారా బట్టీలపై దాడులు | - | Sakshi
Sakshi News home page

సారా బట్టీలపై దాడులు

Jul 27 2026 2:24 AM | Updated on Jul 27 2026 2:24 AM

ఇద్దరు అరెస్టు

జయపురం: జయపురం సమితి ధన్‌పూర్‌ గ్రామ పంచాయతీ జిలిమిలిగుడ గ్రామ ప్రాంత అడవిలో సారా బట్టీలపై అబ్కారి సిబ్బంది దాడులు నిర్వహించారు. గ్రామ సమీపంలో సారా అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు అబ్కారి ఇన్‌స్పెక్టర్‌ అజయ కుమార్‌ నాయక్‌ ఆదివారం వెల్లడించారు. జిలిమిలిగుడ ప్రాంతంలో నిర్వహిస్తున్న మూడు సారా బట్టీలపై దాడులు చేశామన్నారు. రూ.70 వేలకు పైగా విలువైన సారా తయారీకి సిద్ధం చేసిన ఊటతోపాటు సారాను పారబోసినట్లు వెల్లడించారు. తనతో పాటు జయపురం అబ్కారి విభాగ ఓఐసీ సుభ్రత్‌ కేశరీ హిరన్‌, అబ్కారీ సిబ్బంది కలిసి పెట్రోలింగ్‌ జరుపుతున్న సమయంలో జిలిమిలిగుడ గ్రామ సమీప అడవిలో సారా బట్టీల్లో సారా వంటకం జరుగుతుందని అందిన సమాచారంతో దాడులు నిర్వహించినట్లు శ్రీనాయక్‌ వెల్లడించారు. సారా వండుతున్న వ్యక్తులు అబ్కారీ సిబ్బందిని చూసి పారిపోయారన్నారు. ఆ ప్రాంతంలో సారా వంటకం జరుగుతున్న మూడు సారా బట్టీలపై దాడులు నిర్వహించి 80 లీటర్ల సారా, 1200 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశామన్నారు. సారా వండేందుకు వినియోగించే సామగ్రి, డ్రమ్ములు సీజ్‌ చేశామన్నారు. పెట్రోలింగ్‌ సమయంలో నాటు సారా అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన త్రినాథ్‌, బాసుదేవ్‌ను అరెస్టు చేసి, కేసులు నమోదు చేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement