జయపురం: జయపురం విక్రమ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ కళాశాలలో జగన్నాథ రథయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన దారు దేవత చిత్ర కళా ప్రదర్శన ఆదివారంతో ముగిసింది. జయపురం సబ్ కలెక్టర్ జాదుమణి నాయిక్ హాజరై జయపురం మహారాజు కళాప్రపూర్ణ విక్రమదేవ వర్మ, కళాశాల ప్రథమ ప్రిన్సిపాల్ సంహాచళ మహారాణల విగ్రహాలకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాచీన కళలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. అనంతరం పపర్యవేక్షకులు, రచయిత డాక్టర్ పరేష్ రథ్ రచించిన జయపురం రథాజాత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీడీఓ శక్తి మహాపాత్రో, కొరాపుట్ సాంస్కృతిక అధికారి ప్రీతి శుధా ెజెనా, ప్రిన్సిపాల్ యుధిష్టర్ మల్లిక్, రచయిత కృష్ణచంద్ర పాల్గొన్నారు.


