ఇంకెన్నాళ్లు..? | - | Sakshi
Sakshi News home page

ఇంకెన్నాళ్లు..?

Jul 27 2026 2:18 AM | Updated on Jul 27 2026 2:18 AM

పనులు.. ఇంకెన్నాళ్లు..?

నరసన్నపేటలో నత్తనడకన ఆస్పత్రి భవనాల నిర్మాణం గత ప్రభుత్వ హయాంలో రూ.12.50 కోట్లతో మంజూరు అప్పట్లోనే 60 శాతం పనులు పూర్తి మిగిలిన పనులు పూర్తి చేయని కూటమి ప్రభుత్వం

టార్గెట్‌ డిసెంబర్‌

నిర్మాణం పూర్తయితేనే..

పనులు..

నరసన్నపేట:

ర్భిణులకు, బాలింతలకు సౌకర్యవంతంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో నరసన్నపేట ఏరి యా ఆస్పత్రిని వంద పడకలకు విస్తరించేందుకు గత ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిలో భాగంగానే ప్రసూతి వార్డు మంజూరు చేసింది. ఆస్పత్రి సేవలు మెరుగుపరిచేందుకు వీలుగా మరిన్ని గదు లు అవసరమని భావించి రూ.12.56 కోట్లు మంజూరు చేసింది. టెండరు వేసి పనులు ప్రారంభమైనప్పటికీ తర్వాత ప్రభుత్వం మారిపోవడంతో పనుల కు మోక్షం కలగడం లేదు. గతేడాది మార్చి నాటికి పనులు పూర్తి చేస్తామని ఇంజినీరింగ్‌ అధికారులు ప్రకటించారు. తర్వాత డిసెంబర్‌కు పొడి గించారు. 2026 సంవత్సరం వచ్చి ఏడు నెలలు అవుతున్నాయి. ఇప్పటికీ పనులు సాగుతూనే ఉన్నా యి. గత నెల రోజులుగా పనులు పూర్తిగా నిలిపి వేశారు. ఇంకెన్నాళ్లు ఈ పనులు చేస్తారోనంటూ స్థానికులు నిలదీస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాతే పనులు మరింత జా ప్యంతో జరుగుతున్నాయని మండిపడుతున్నారు. తాజా అంచనాల ప్రకారం 75 శాతం పనులు జరిగినట్లు ఏపీఎంఎస్‌ఐడీసీ ఇంజినీరింగ్‌ అధికారులు చెబుతున్నా రు. రానున్న డిసెంబరు నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

బిల్లులు పెండింగే కారణమా..

ఆస్పత్రి భవనాల నిర్మాణ పనులు చేస్తున్నా సకాలంలో బిల్లులు చెల్లించడం లేదని, అందుకే పనులు ముందుకు కదలడం లేదని తెలుస్తోంది. జూన్‌ నాటికి రూ. 1.5 కోట్లు బిల్లులు చెల్లించాల్సి ఉందని సమాచారం. మరో రూ. 2.5 కోట్లు పనులు చేయా ల్సి ఉంది. గదులు, ఫ్లోరింగ్‌, ఇతర ఫినిషింగ్‌ పను లు, రెండు లిఫ్టులు నిర్మించాల్సి ఉంది. ఇంటెర్నెల్‌ రోడ్లు, ప్రహరీ, పోస్టుమార్టం గది, ప్రసూతి వార్డు లో ఆపరేషన్‌ గది ఏర్పాటు చేయాల్సి ఉంది.

వైద్య సిబ్బందికి అవస్థలు..

ఆస్పత్రి పనులు నత్తనడకన సాగుతుండటంతో వైద్యులు, సిబ్బంది, రోగులు అవస్థలు పడుతున్నా రు. పాత భవనంపై నాలుగో అంతస్తు నిర్మాణం కారణంగా క్రింద అంతస్తుల్లో పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రధానంగా వాటర్‌ పంపింగ్‌ ఇబ్బందికరంగా మారుతోంది. వంద పడక లు ఏర్పాటు చేయాల్సి ఉండగా ప్రస్తుతానికి అవసరమైన గదులు లేకపోవడంతో 85 బెడ్స్‌ మాత్రమే నిర్వహిస్తున్నారు. 22 మంది వైద్యులు ఉండగా అందరూ ఇరుకు గదుల్లో ఉండాల్సి వస్తోంది. స్పెషలి స్టు వైద్యులకు కూడా ప్రత్యేక గదులు లేని పరిస్థితి నెలకొంది. కొత్త భవనాలు అందుబాటులోకి రాకపోవడంతో గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లల వార్డులు కూడా ప్రధాన భవనంలోనే నిర్వహిస్తున్నా రు. కంటి, ఆర్థో, దంత వైద్యులకు వేర్వేరుగా సదుపాయాలు కల్పించాల్సి ఉంది. తాజాగా ఏరియా ఆసుపత్రిలో ఉన్న బ్లెడ్‌ స్టోరేజ్‌ యూనిట్‌ను బ్లెడ్‌ సెంటర్‌గా అప్‌గ్రేడ్‌ చేశారు. దీనికి సైతం అదనపు గదులు కేటాయించాల్సి ఉంది.

నిర్మాణ పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌పై ఒత్తిడి చేస్తున్నాం. బిల్లులు పెండింగ్‌ ఉన్నట్లు చెబుతున్నారు. ఇతర పనులు డిమాండ్‌ ఉన్నందు వల్ల పనులపై దృష్టిపెట్టలేక పోతున్నాం. డిసెంబరు నాటికి భవనాలు పూర్తి చేసి అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

– వెంకటేష్‌ ఏఈ, ఏపీఎంఎస్‌ఐడీసీ

అదనపు భవనాలు, ప్రసూతి వార్డు పూర్తి కాకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నాం. వైద్యు లకు సరిపడా గదులు ల్లేవు. గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు విభాగాలకు చెందిన సిబ్బంది అవస్థలు పడుతున్నారు. సకాలంలో భవనా లు పూర్తి చేయాలి. – శ్రీనుబాబు,

ఆస్పత్రి సూపరింటెండెంట్‌, నరసన్నపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement