‘రవాణా సదుపాయంతోనే పారిశ్రామికాభివృద్ధి’ | - | Sakshi
Sakshi News home page

‘రవాణా సదుపాయంతోనే పారిశ్రామికాభివృద్ధి’

Jul 27 2026 2:18 AM | Updated on Jul 27 2026 2:18 AM

రణస్థలం: రోడ్డు మార్గాలకు అనుసంధానంగా వాయు మార్గం చక్కగా ఉంటే ఆ ప్రాంతాలు, పరిశ్రమల సమగ్ర అభివృద్ధి శరవేగంగా పెరుగుతుందని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలిపారు. పైడిభీమవరం పారిశ్రామికవాడలో ని ఏపీఐఐసీ దగ్గర ఏర్పాటు చేసిన ‘ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు’ కర్టెన్‌ రైజర్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిర్‌పోర్టు నుంచి అరగంట ప్రయాణ దూరంలో ఉన్న పైడిభీమవరం, రణస్థలం, స్థానిక పరిశ్రమలకు విదేశీ వ్యాపారవేత్తలు, కొనుగోలుదారులు సులభంగా వచ్చిపోయే అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. చిన్న తరహా వ్యాపారాలు, అనుబంధ పరిశ్రమలు, మత్స్యకారులు, స్థానిక వ్యాపారులు తమ ఉత్పత్తుల విలువ పెంపుదలపై దృష్టి పెట్టాలని అన్నారు.

కాలువలో బయటపడిన

మృతదేహం

సరుబుజ్జిలి,హిరమండలం: బప్పడాం వంశధార కుడి కాలువలో ఆదివారం మృతదేహం గుర్రపు డెక్కలో చిక్కుకొని అటుగా వెళుతున్న కొంతమంది వ్యక్తులకు కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్థానిక పోలీసులు రంగప్రవేశం చేసి పూర్తి వివరాలు సేకరించారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం మృతుడు జి.సూర్యనారాయణ(45) ఎల్‌ఎన్‌పేట మండలం బొర్రంపేట గ్రామానికి చెందిన వ్యక్తిగా తెలిపారు. ఈయనకు భార్య పార్వతి, పిల్లలు ఉన్నారు. రెండు రోజుల కిందట ఇంటి నుంచి బహిర్భూమి కోసం బయటకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు కాలువలో జారి చనిపోయినట్లు తెలిపారు. మృతుని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం కోసం శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రికి తరలించినట్లు ఏఎస్‌ఐ చంద్రినాయుడు తెలిపారు.

ముగిసిన జిల్లాస్థాయి తైక్వాండో పోటీలు

శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి తైక్వాండో పోటీలు ముగిశాయి. తైక్వాండో అసోసియేషన్‌ ఆఫ్‌ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్‌ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఆద్యంతం హోరాహోరీగా సాగి న జిల్లాస్థాయి తైక్వాండో పోటీలు ఆదివారం సాయంత్రంతో ముగిశాయి. అంతకుముందు ప్రారంభమైన జిల్లా స్థాయి తైక్వాండో పోటీలకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపైనా సమానమైన ఆస క్తి పెంపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. క్రీడలు మానసిక ప్రశాంతతను అందిస్తాయన్నారు. నిర్వాహకులు తైక్వాండో సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమర భాస్కర్‌ మా ట్లాడుతు ఆగస్టు 21 నుంచి 23వ తేదీ వరకు శ్రీకాకుళం జిల్లా ఆతిథ్యంలో వైఎస్సార్‌ కల్యా ణ మండపం వేదికగా ఏపీ రాష్ట్రస్థాయి తైక్వాండో చాంపియన్‌షిప్‌ పోటీలు జరుగుతాయన్నా రు. ఇక్కడ విజేతలుగా నిలిచిన క్రీడాకారులు రాష్ట్రపోటీలకు అర్హత సాధిస్తారని భాస్కర్‌ చెప్పారు. సబ్‌ జూనియర్‌, క్యాడెట్‌, జూనియర్‌, సీనియర్‌ విభాగాల్లో నిర్వహించిన ఈ జిల్లా స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు పతకాలు అందజేశారు.

బడికి విష జంతువుల భయం

నందిగాం: మండలంలోని కర్లపూడి ప్రాథమిక పాఠశాల గ్రామానికి దూరంగా కొండకు ఆనుకొని ఉంది. పాఠశాలలో 14 మంది విద్యార్థులు, ఒక ఉపా ధ్యాయురాలు ఉన్నారు. పాఠశాల చుట్టూ దట్టమైన పొదలు ఉండడం, కొండ కూడా సమీపంలోనే ఉండడంతో విష జంతువులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బడికి రక్షణ గోడ నిర్మించాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement