భువనేశ్వర్: పవిత్రమైన ఆషాఢ శుక్ల ద్వాదశి సందర్భంగా ఆదివారం రథంపై ఆశీనులైన బలభద్ర, దేవీ సుభద్ర, శ్రీ జగన్నాథునికి అధర పానకం సమర్పించారు. ఈ వేడుకని ఒధొరొ పొణాగా వ్యవహరిస్తారు. రథాల అధిదేవతలు, పార్శ్వ దేవతలను ప్రసన్నం చేసుకోవడంతో దేహరహిత ఆత్మలను ప్రసన్నం చేసుకోవడం ఒధొరొ పొణా ఘట్టం ఇతివృత్తంగా పేర్కొంటారు. మధ్యాహ్న ధూపం పూర్తయిన తర్వాత, సాయంకాల ప్రార్థనలకు ముందు ఈ కర్మను నిర్వహిస్తారు. శ్రీ విగ్రహాల పెదవుల ఎత్తుకు సరిపోయేంత ఎత్తులో ఉండే ప్రత్యేకంగా తయారు చేసిన పొడుగాటి మట్టి పాత్రలలో సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన పానకం నింపుతారు. ఒక్కో రథానికి 3 పాత్రల వంతున మొత్తం 9 బాణల్లో శ్రీవిగ్రహాలకు ప్రత్యేకంగా తయారు చేసిన పానకం సమర్పిస్తారు. 9 బాణల్లో పాణకం నింపిన తర్వాత పంచోపచార పద్ధతిలో శ్రీవిగ్రహాలకు సమర్పిస్తారు. ఇదంతా ముగిసిన తర్వాత పానకంతో నింపిన కుండలను రథంపై పగలగొడతారు. చండీచాముండ వంటి శక్తులను సంతృప్తి పరిచేందుకు కుండలను పగలగొట్టే పానకం ధారాపాతంగా విడిచి పెడతారు.
ఒడియా మఠం పంపిణీ చేసిన అధర పానకం బాణలు
నందిఘోష్ రథంపై శ్రీ జగన్నాథునికి అధర పానకం సమర్పణ


