ఆగస్ట్ 2 నుంచి 5 వరకు సిక్కోలు
వేదికగా మెగా టోర్నీ
సీనియర్స్ మెన్, ఉమెన్ విభాగాల్లో పోరు
ముస్తాబవుతున్న డీఎస్‌ఏ ఇండోర్ స్టేడియం
జిల్లాకు గర్వకారణం..
ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు..
శ్రీకాకుళం న్యూకాలనీ: సిక్కోలు వేదికగా కొత్త సీజన్‌లో బ్యాడ్మింటన్ స్టేట్‌మీట్ పోటీలకు రంగం సిద్ధమౌతోంది. ఏపీబీఏ, బాయ్ సహకారంతో శ్రీకాకుళం జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో ఆగస్ట్ 2 నుంచి 5 వరకు ఏపీ రాష్ట్రస్థాయి (అంతర్‌జిల్లాల) సీనియర్స్ పురుషులు, మహిళల బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్– 2026 పోటీలు జరగనున్నాయి. జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌కాలనీలో ఉన్న డీఎస్‌ఏ ఇండోర్ స్టేడి యం వేదికగా జరిగే ఈ టోర్నీ కోసం ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టిన జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ తొమ్మిది కమిటీలను నియమించింది. బ్యాడ్మింటన్ కోర్టులకు ఇటీవల నూతన మ్యాట్‌లను అమర్చి, తుది మెరుగులు దిద్దారు.
2న క్వాలిఫయింగ్ రౌండ్స్..
ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ టోర్నీ లో భాగంగా ఆగస్ట్ 2న క్వాలిఫైయింగ్ రౌండ్స్ నిర్వహించనున్నారు. 3వ తేదీ నుంచి 5 వరకు మెయిన్ డ్రా పోటీలు జరగనున్నా యి. మొత్తం ఐదు కేటగిరిల్లో పోరు కొనసాగనుంది. పురుషుల సింగిల్స్, డబుల్స్, మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో పోటీలు జరుగుతాయి. సీనియర్స్ విభాగంలో పోటీలు కావడంతో యువ, వర్ధమాన షట్లర్లతోపాటు పలువురు సీనియర్స్ రేటింగ్ ప్లేయర్స్ హాజరుకానుండటంతో పోటీలు ఆద్యంతం ఉత్కంఠగా సాగనున్నాయి. 3వ తేదీన ఉదయం 10 గంటలకు నిర్వహించే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘ నాయకులు హాజరవుతున్నా రు. ఇక్కడ విజేతలుగా నిలిచిన క్రీడాకారులు త్వర లో భువనేశ్వర్ వేదికగా జరిగే సీనియర్ నేషనల్స్ బ్యాడ్మింటన్‌షిప్ పోటీలకు నేరుగా అర్హత సాధిస్తారు.
13 జిల్లాల నుంచి క్రీడాకారుల రాక..
మెగా టోర్నీ కోసం ఉమ్మడి 13 జిల్లాల నుంచి 156 మంది వరకు క్రీడాకారులతోపాటు మరో 52 మంది కోచ్ మేనేజర్లు హాజరవుతున్నారు. క్వాలిఫైయింగ్ రౌండ్స్‌కు హాజరయ్యే క్రీడాకారుల్లో 1:4 నిష్పత్తిలో విజేత షట్లర్లను మెయిన్‌డ్రాకు ఎంపికచేయనున్నారు. క్రీడాకారులు, తదితరులకు ఇండోర్ స్టేడియంలో సమీపంలో వసతి కల్పించనున్నారు. మీట్ నిర్వహణకు రూ.12లక్షలతో ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం తరఫున సాయం అందిస్తే క్రీడాకారులకు మరింత ఉన్నత స్థాయిలో వసతులు కల్పించడానికి అవకాశం లభిస్తుంది.
మీట్ నిర్వహణకు ఇప్పటికే ఏ ర్పాట్లలో నిమగ్నమయ్యాం. జిల్లాలో 2024 తర్వాత మళ్లీ మరో స్టేట్‌మీట్ నిర్వహిస్తుండటం సంతోషంగా ఉంది. నా తరఫున ఆర్థిక సాయంతోపాటు జెమ్స్, కిమ్స్ హాస్పటల్ తరఫున మెడికిల్ కిట్, సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నాం.
– డాక్టర్ గూడేన సోమేశ్వరరావు, స్టేట్‌మీట్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్
శ్రీకాకుళంకు వచ్చే క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రూ.12 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నాం. జిల్లా బ్యాడ్మింటన్ సంఘం తరఫున ప్రతిఒక్కరూ సాయం చేసేందుకు ముందుకొస్తున్నాం. క్రీడా పోటీల నిర్వహణకు ప్రభుత్వం కూడా సాయం అందిస్తే బాగుంటుంది.
– నారాయణశెట్టి వెంకట కిరణ్‌కుమార్,
స్టేట్‌మీట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ


