మల్కన్‌గిరి: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని వక్తలు అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ సోమనాథ్ ప్రధాన్ అధ్యక్షతన బాల్య వివాహాల నిర్మూలన కోసం జిల్లాస్థాయి ప్రత్యేక అమలు శిక్షణా కార్యక్రమం, సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించేందుకు రూపొందించిన జిల్లా యాక్షన్ ప్లాన్ 2026–2029 పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వేద్బార్ ప్రధాన్, ముఖ్య అభివృద్ధి శాఖ అధికారి దాశరథి సరాబు, జిల్లా సబ్ కలెక్టర్ దుర్యోదన్ బోయి, జిల్లా సామాజిక సంక్షేమ అధికారి సుచితా పండా, యూనిసెఫ్ వనరుల వ్యక్తి ఘాసిరామ్ పండా, జిల్లా ఆస్పత్రి వైద్యుడు రణసింగ్, జిల్లా శిశు సంరక్షణ అధికారి నారాయణ దాస్ తదితరులు పాల్గొన్నారు.


