చోరీ కేసులో నిందితుడు అరెస్టు | - | Sakshi
Sakshi News home page

చోరీ కేసులో నిందితుడు అరెస్టు

Jul 18 2026 9:33 AM | Updated on Jul 18 2026 9:33 AM

మల్కన్‌గిరి: జిల్లాలోని కోరుకొండ పోలీసులు నీటిపంపు చోరీ కేసులో నిందితుడిని శుక్రవారం అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కోరుకొండ సమితి తుముసాపల్లి పంచాయతీ ఎంవీ 12 గ్రామానికి చెందిన నారాయణ్‌ గైన్‌ అనే వ్యక్తి తన ఇంటికి తాళంవేసి పనిమీద మత్తిలికి వెళ్లారు. దీంతో ఈనెల 11వ తేదీన అదే గ్రామానికి చెందిన అవినాష్‌ సర్కార్‌ అనే వ్యక్తి ఇంటి తాళం పగలుగొట్టి ఇంట్లో నీటిపంపును దొంగలించాడు. 12వ తేదీన వచ్చిన నారాయణ్‌ తన ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించి కోరుకొండ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఏఎస్‌ఐ నీలాంచల్‌ శరబ్‌ కేసు నమోద్‌ చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని నాలుగు రోజుల్లో అరెస్టు చేశారు. పూర్తి విచారణ అనంతరం కోర్టుకు తరలిస్తామని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement