ముగిసిన క్రికెట్‌ టోర్నీ | - | Sakshi
Sakshi News home page

ముగిసిన క్రికెట్‌ టోర్నీ

Jul 15 2026 12:23 AM | Updated on Jul 15 2026 12:23 AM

విజేత మల్లిగాం జట్టు

రాయగడ: సదరు సమితి అమలాభట్ట డిగ్రీ కళాశాల వెనుకగల మైదానంలో నెల రోజుల జరుగుతున్న శ్రీలక్ష్మీనృసింహ క్రికెట్‌ టోర్నెమెంటు మంగళవారంతో ముగిసింది. రాజ్యసభ మాజీ ఎంపీ నెక్కంటి భాస్కరరావు ముగింపు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతీ క్రీడాకారుడు తన లక్ష్యాన్ని చేరుకొవాలంటే ఇటువంటి తరహా క్రీడల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని సూచించారు. క్రీడల్లో మన రాష్ట్రం ఎంతొ ముందుకు వెళుతుందని అన్నారు. క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకునేందుకు ఇటువంటి తరహా వేదికలను సద్వినియోగపరుచుకొవాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. టోర్నెమెంటులో వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 33 జట్లు పాల్గొన్నాయని శ్రీక్షేత్ర టౌన్‌ షిప్‌ అధినేత దూడల శ్రీనివాస్‌ వివరించారు. ఫైనల్స్‌ పోటీలొ మల్లిగాం, అమలాభట్ట జట్లు హోరాహోరీగా పోటీ పడ్డాయని వివరించారు. మల్లిగాం జట్టు విజేతగా నిలవగా రన్నర్‌గా అమలాభట్ట జట్టు నిలిచిందని అన్నారు. విజేత జట్టుకు 33,333 రూపాయల నగదుతో పాటు ట్రోఫీ, రన్నర్‌ జట్టుకు 22,222 నగదుతో పాటు ట్రోఫీని ముఖ్యఅతిధిగా హాజరైన నెక్కంటి ప్రదానం చేశారు. కార్యక్రమంలో పెద్దింటి తపన్‌, రాయగడ సమితి వైస్‌ చైర్మన్‌ హరప్రసాద్‌ హెపురక, జిల్లా పరిషత్‌ సభ్యురాలు సంద్యా పులక, రాష్ట్ర మాజీ మంత్రి లాల్‌ బిహారి హిమిరక పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement