పూరీ జిల్లా పోలీస్‌, మేజిస్ట్రేట్‌ సమన్వయ సమావేశం | - | Sakshi
Sakshi News home page

పూరీ జిల్లా పోలీస్‌, మేజిస్ట్రేట్‌ సమన్వయ సమావేశం

Jul 14 2026 4:35 AM | Updated on Jul 14 2026 4:35 AM

భువనేశ్వర్‌:

గ్గర పడుతున్న పూరీ శ్రీ జగన్నాథ మహా ప్రభువు రథ యాత్ర సజావుగా జరిపించేందుకు పూరీ జిల్లా యంత్రాంగం తలమునకలై ఉంది. పలు ప్రాంతాల నుంచి తరలి వచ్చే యాత్రికులకు సురక్షిత సుదర్శనం ప్రసాదించాలని జిల్లా అధికార వర్గం చురుగ్గా పని చేస్తోంది. ఈ లక్ష్య సాధనకు క్రమబద్ధమైన ఏర్పాట్లు చేసేలా నిర్ధారించడానికి జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన స్థానిక టౌన్‌ హాల్‌లో పోలీస్‌, మేజిస్ట్రేట్‌ సమన్వయ సమావేశం నిర్వహించారు. సిబ్బంది మోహరింపు, ట్రాఫిక్‌, జన సందోహ నియంత్రణ, అత్యవసర స్పందన, వివిధ శాఖల మధ్య సమన్వయం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. సురక్షితమైన, భద్రమైన, ప్రశాంతమైన యాత్రను నిర్వహించడానికి ఒడిశా పోలీసులు, జిల్లా యంత్రాంగంతో కలిసి కట్టుబడి ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిపాలన కార్యనిర్వాహక అధికారులు, న్యాయాధికారులు, పోలీసు శాఖ అధికారులు సమన్వయంగా సమావేశమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement