పర్లాకిమిడి గుండిచా మందిరం వద్ద ఆక్రమణల తొలగింపు | - | Sakshi
Sakshi News home page

పర్లాకిమిడి గుండిచా మందిరం వద్ద ఆక్రమణల తొలగింపు

Jul 14 2026 4:35 AM | Updated on Jul 14 2026 4:35 AM

పర్లాకిమిడి: రథయాత్ర సమీపిస్తుండంతో పట్టణంలో గుండిచా మందిరం వద్ద ఉన్న ఆక్రమణలను జిల్లా అధికారులు పోలీసులు, సబ్‌ కలెక్టర్‌, తహసీల్దార్‌, మేజిస్ట్రేట్‌ సహకారంతో సోమవారం తొలగించారు. రాజవీధిలో కూడా అనేక ఆక్రమణలు ఉన్నాయని వాటిని మంగళవారం నోటీసులు ఇచ్చి తొలగిస్తామని సబ్‌కలెక్టర్‌ అనుప్‌ పండా అన్నారు. రాజవీధి శ్రీజగన్నాథ మందిరం నుంచి ఫర్లాంగు దూరంలో ఉన్న గుండిచామందిరం వరకూ ఉన్న ఆక్రమణలు, తోపుడు బండ్లు, మెకానికల్‌ గ్యారేజిలను తొలగించి జగన్నాథ రథాలు సురక్షితంగా గుండిచా మందిరానికి చేరుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నామని తహసీల్దార్‌ నారాయణ బెహారా తెలియజేశారు. ఈ తొలగింపులో మోడల్‌ పోలీస్‌స్టేషన్‌ అధికారి (ఐఐసి) ప్రశాంత భూపతి, పురపాలక సంఘం ఈఓ లక్ష్మణ ముర్ము తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement