కేరళంలో రోడ్డు ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

కేరళంలో రోడ్డు ప్రమాదం

Jul 14 2026 4:35 AM | Updated on Jul 14 2026 4:35 AM

● రాయగడ జిల్లావాసి మృతి

● రాయగడ జిల్లావాసి మృతి

రాయగడ: జిల్లాలోని కాసీపూర్‌ సమితికి చెందిన వలస కార్మికుడు కేరళంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడు చంద్రగిరి గ్రామపంచాయతీ పరిధిలోని తలపత్రి గ్రామానికి చెందిన జులార మాఝి (55)గా గుర్తించారు. గత ఏడాది కేరళంలోని పాలక్కాడ్‌ ప్రాంతంలో ఉన్న క్రషర్‌ కంపెనీలో కార్మికుడిగా చేరాడు. ఈ నెల 12వ తేదీన విధులు ముగించుకుని ఇతర కార్మికులతో కలిసి తమ వసతి గృహానికి తిరిగి వెళ్తున్న సమయంలో ఎదురుగా ప్రయాణికులతో వచ్చిన బస్సు జులార మాఝిను బలంగా ఢీట్టడంతో సంఘటన స్థలం వద్దే మృతి చెందాడు. ప్రమాద సమాచారాన్ని రాయగడ జిల్లా కార్మిక శాఖ అధికారికి బాధిత కుటుంబీకులు తెలియజేశారు. స్పందించిన కార్మిక శాఖ అధికారి విష్ణు నాయక్‌ కేరళం సంబంధిత శాఖ అధికారులను సంప్రదించారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించే ఏర్పాటు చేయాలని కోరారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు కార్మిక శాఖ తెలియజేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement