పర్లాకిమిడి: గజపతి జిల్లా రాయఘడ బ్లాక్ పంచాయతీ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ జాయింట్ గ్రీవెన్స్ సెల్‌కు అధిక స్పందన లభించింది. జిల్లా కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్, జిల్లా పరిషత్ సి.డి.ఓ దయామయ పాడీ, జిల్లా సమగ్ర గిరిజనాభివృద్ధి శాఖ పీఓ అంశుమాన్ మహాపాత్రో, తదితరులు హాజరయ్యారు. 31 వినతులు అందాయి. అందులో వ్యక్తిగతం 14, వివిధ గ్రామ పంచాయతీలకు సంబంధించినవి 17 ఉన్నాయి. జిల్లా సామాజిక సురక్ష, దివ్యాంగుల సశక్తీకరణ విభాగం ద్వారా ముగ్గురికి మధుబాబు పింఛన్లను కలెక్టర్ అందజేశారు. ప్రజా వినతులను త్వరితగతిన పరిష్కరించాలని రాయఘడ బ్లాక్ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. గ్రీవెన్స్‌కు రాయఘడ బ్లాక్ చైర్మన్ పూర్ణబాసి నాయక్, వైస్ చైర్మన్ జ్యోతి ప్రసాద్ పాణి, బి.డి.ఓ సురేష్ కుమార్ బారిక్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


