మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి కప్పతుటి పంచాయతీ కార్యాలయం జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ రాజశిర్కే ఆధ్వర్యంలో సోమవా రం గ్రీవెన్స్‌సెల్ నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 72 వినతులు స్వీకరించారు. వీటిలో కొన్ని వినతులను అక్కడికక్కడే పరిష్కరించాగా.. మరికొన్నింటిని పరిశీలించి పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం కలెక్టర్ ప్రధమేశ్ చిత్రకొండ సమితిలోని గుంఠబేఢ పంచాయతీ కందగూఢ గ్రామంలో ముఖ్యమంత్రి మక్కా మిషన్ కింద సాగు చేస్తున్న మొక్కజొన్న పంట పొలాలను పరిశీలించారు. అనంతరం ,మెకనైజ్డ్ సీడ్–కమ్–ఫెర్టిలైజర్ డ్రిల్లర్ ద్వారా నిర్వహిస్తున్న విత్తనాలు, ఎరువుల విత్తే ప్రక్రియపై సమీక్షించారు. ఆధునిక వ్యవసాయ యంత్రాల వినియోగంపై రైతులకు వివరించారు. జిల్లా ఎస్పీ వినోద్, జిల్లా సబ్ కలెక్టర్ దూర్యోధన్ బోయి, జిల్లా అభివృద్ధిశాఖ అధికారి దశరాథి సరబు, ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.


