జయపురం: జయపురం జిల్లా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో అవిభక్త కొరాపుట్ జిల్లా ఫారెస్టు డిపార్ట్‌మెంట్ నిర్వహించిన ఫుట్‌బాల్ ప్రీమియర్ లీగ్ పోటీలలో మల్కన్‌గిరి ఫారెస్ట్ డివిజన్ టీమ్ విజయం సాధించి చాంపియన్‌గా నిలిచింది. మల్కన్‌గిరి, నవరంగపూర్, కొరాపుట్, రాయగడ, జయపురం జిల్లాల ఫారెస్టు డివిజన్‌ల నుంచి 8 టీములు పోటీల్లో పాల్గొన్నాయి. మల్కన్‌గిరి ఫారెస్ట్ డివిజన్ మాస్టర్స్ టీమ్, కొరాపుట్ జిల్లా ఫారెస్ట్ విభాగ హైలాండర్ష్ టీమ్‌లు ఫైనల్‌కు చేరాయి. ఆదివారం జరిగిన ఫైనల్ పోటీలలో రెండు టీమ్‌లు హోరాహోరీగా పోరాడాయి. నిర్ణీత సమయానికి రెండు టీమ్‌లు ఒక్కొక్క గోలు చేయక పోవటంతో ఆట డ్రా అయింది. తరువాత ఫెనాల్టీ షూట్ ఔట్‌లో కూడా గెలుపు లక్ష్యంతో ఆడాయి. మల్కన్‌గిరి ఫారెస్టు డివిజన్ మాస్టర్స్ టీమ్‌ను విజయం వరించింది. మల్కనగిరి టీమ్ 4–3 గోల్స్‌తో చాంపియన్‌గా నిలిచింది. ముఖ్యఅతిథిగా కొరాపుట్ ఫారెస్ట్ సర్కిల్ రీజనల్ కంజర్వేటర్ ఆఫ్ ఫారెస్టర్ డాక్టర్ పశుపతి చాంపియన్ టీమ్‌కు ట్రోఫీని అందజేశారు. రన్నర్ జట్టుకు ట్రోఫీ అందజేసి సత్కరించారు.


