● ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన ఝార్సుగుడ ఎస్పీ రాఘవేంద్ర
రాయగడ: రాబోయే రథాయాత్ర ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ఝార్సుగుడ పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రతా చర్యలను సమీక్షించేందుకు ఎస్‌పి జిఆర్ రాఘవేంద్ర స్వయంగా పాదయాత్ర నిర్వహించి రథయాత్ర కమిటీలు, స్థానిక ప్రజలు, వ్యాపారులతొ సమావేశమై పలు కీలక సూచనలు చేసారు. ఉత్సవ నిర్వాహకులకు సిసీటీవి కేమేరాల ఏర్పాటు ,తగిన బ్యారికేడ్లు, ప్రవేశ –నిష్క్రమణ మార్గాల నియంత్రణ ,పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ,అత్యవసర పరస్ధితులకు ముందస్తు ఏర్పాట్లు, అగ్నిమాపక భద్రత,ట్రాఫిక్, పార్కింగ్ నిర్వహణ, తగిన లైటింగ్, జనసందొహన నియంత్రణ కొసం వాలంటీర్ల నియమకం వంటి అంశాలపై ప్రత్యేక సూచనలు ఆయన చేసారు. ఉత్సవ కమిటీలు పోలీసులకు పూర్తిస్ధాయిలొ సహకరించాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.


