రాష్ట్రంలో 12 శాతం అధిక వర్షపాతం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో 12 శాతం అధిక వర్షపాతం

Jul 12 2026 3:47 AM | Updated on Jul 12 2026 3:47 AM

భువనేశ్వర్‌: రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటి వరకు 341.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ సగటు వర్షపాతం కంటే 12 శాతం అధికం కావడం విశేషం. అయితే సుందర్‌గఢ్‌, దేవ్‌గఢ్‌, కలహండి, నవరంగ్‌పూర్‌ అనే 4 జిల్లాల్లో మాత్రం ఇప్పటికీ వర్షపాతం లోటుగానే ఉంది. ఈ నెల 14న బంగాళా ఖాతంలో మరో అల్పపీడనం ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. ఈ వ్యవస్థ వాయువ్య దిశగా చత్తీస్‌గఢ్‌ వైపు కదలడం వల్ల ఉత్తర, పశ్చిమ ఒడిశాలో వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ నెల 16 వరకు భారత వాతావరణ శాఖ వర్షపాతం హెచ్చరిక జారీ చేసింది.

జటానీలో యువకుడి దారుణ హత్య

భువనేశ్వర్‌: జటానీ ఖుదుపూర్‌ చౌరస్తా వద్ద శుక్రవారం రాత్రి పొద్దుపోయాక ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కత్తితో దారుణంగా దుండగులు నరికి చంపేశారు. మృతుడిని ఖుదుపూర్‌ గ్రామానికి చెందిన మార్కండ బలియార్‌సింగ్‌ (జొగ్గా)గా గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. మార్కండ బలియార్‌సింగ్‌ చౌరస్తాలో నిలబడి ఉండగా గుర్తు తెలియని దుండగుడు అతనిపై అకస్మాత్తుగా దాడి చేశాడు. అతని కడుపు, ఛాతీపై పలుమార్లు కత్తితో పొడిచి దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందడంతో జటానీ ఠాణా పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. విచారణ కోసం ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.

దొంగతనం కేసులో

నిందితుడి అరెస్టు

మల్కన్‌గిరి: చోరీ కేసులో అజయ్‌ బిశోయ్ను అనే నిందితుడుని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కేసు వివరాల్లోకి వెళితే.. డీఎన్‌కే కెనాల్‌ కాలనీలోని ప్రభుత్వ క్వార్టర్‌లో పద్మావతి జేనా ఉంటున్నారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన ఆమె ఇంటిలో లేని సమయంలో అజయ్‌ బిశోయ్ను చోరబడి లక్షలాది రూపాయల విలువ చేసే బంగారు అభరణాలను చోరీ చేశారు. తరువాత ఇంటికి వచ్చిన పద్మావతి జేనా చోరీ జరిగినట్టు గుర్తించి మల్కన్‌గిరి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాధు చేశారు. కేసు నమోదు చేసిన ఐసీ రీగాన్‌ కీండో దర్యాప్తు చేశారు. ఈ క్రమంలోనే అజయ్‌ బిశోయ్ను శనివారం పోలీసులకు పటుబడ్డాడు. దీంతో అతన్ని అరెస్టు చేసి విచారించగా తానే చోరీకి పాల్పడినట్టు అంగీకరించినట్టు పోలీసులు వెల్లడించారు. అయితే చోరీ చేసిన బంగారంలో కొన్ని రవిభత్ర అనే వ్యక్తికి ఇచ్చినట్టు పోలీసులకు తెలియజేయడంతో అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు.

హత్య కేసులో 28 ఏళ్ల తర్వాత నిందితుడి అరెస్టు

రాయగడ: ఒక హత్య కేసుకు సంబంఽధించి 28 ఏళ్ల అనంతరం నిందితుడిని ఝార్సుగుడ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఎస్పీ జిఆర్‌ రాఘవేంద్ర తెలియజేసిన వివరాల ప్రకారం... జిల్లాలోని రెంగాలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 1998, అక్టోబరు 9 వ తేదీన అరెస్టయిన నిందితుడు కస్టడీ నుంచి తప్పించుకుని పరారయ్యాడు. మద్యం మత్తులో ఉన్న దుర్యోధన్‌ అనే వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని నదిలో పడేశారు. దీనిపై మృతుడి కొడుకు రెంగాలి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి నీలమణి మహానందియా, రామ్‌ ఖదియా, విశ్వనాధ్‌ కుహరోలను అరెస్టు చేశారు. అయితే అరెస్టయిన వారిలొ నీలమణి అనే నిందితుడు సౌచాలయానికి వెళ్లి వస్తానని చెప్పి పోలీస్‌ స్టేషన్‌ నుంచి తప్పించుకున్నాడు. మిగతా ఇద్దరు ఈ కేసుకు సంబంధించి బెయిల్‌ పై విడుదలయ్యారు. సుమారు మూడు దశాబ్దాలుగా పరారీలో ఉన్న నీలమణిని పోలీసులు చత్తీస్‌గఢ్‌లో అరెస్టు చేశారు. అయితే పరారీలో ఉన్న నీలమణి నకిలీ ధ్రువీకరణ పత్రాలను సృష్టించి రాజగొండగా చెలామణి అవుతుండేవాడని ఎస్పీ రాఘవేంద్ర తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement