ఝరపడా సెంట్రల్‌ జైలులో హెచ్‌ఐవీ కలకలం! | - | Sakshi
Sakshi News home page

ఝరపడా సెంట్రల్‌ జైలులో హెచ్‌ఐవీ కలకలం!

Jul 11 2026 1:12 AM | Updated on Jul 11 2026 1:12 AM

మరో ఖైదీకి పాజిటివ్‌ నిర్ధారణ

భువనేశ్వర్‌: స్థానిక ఝరపడా సెంట్రల్‌ జైలులో మరో ఖైదీకి హెచ్‌ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆ జైలులో హెచ్‌ఐవీ సోకిన ఖైదీల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఈ పరిస్థితి తోటి ఖైదీల్లో ఆందోళన కలిగిస్తోంది. గురువారం ఖండగిరి ఠాణా పోలీసులు అరెస్టు చేసిన నిందితుడిని కోర్టులో ప్రవేశ పెట్టారు. న్యాయస్థానం అనుమతి మేరకు అతడ్ని జ్యుడిషియల్‌ కస్టడీ కోసం ఝరపడా జైలుకు పంపారు. జైలు నిబంధనల ప్రకారం అతడిని జైలులోకి ప్రవేశపెట్టే ముందు తప్పనిసరి ఆరోగ్య పరీక్షలు, వైద్య స్క్రీనింగ్‌ నిర్వహించారు. ఈ స్క్రీనింగ్‌లో ఆ ఖైదీకి హెచ్‌ఐవీ ఉన్నట్లు నిర్ధారణ అయింది.ఈ సంఘటనకు ముందు జైలులోని ఎనిమి ది మంది ఖైదీలు ఇప్పటికే హెచ్‌ఐవీ పాజిటివ్‌గా గుర్తించబడ్డారు. ఈ కొత్త కేసుతో వారి సంఖ్య తొమ్మిదికి పెరిగింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం కొత్తగా హెచ్‌ఐవీ పాజిటివ్‌గా తేలిన ఖైదీకి ఇతరుల మాదిరిగానే సరైన వైద్య చికిత్స, కౌన్సెలింగ్‌, నిరంతర ఆరోగ్య పర్యవేక్షణ అందిస్తామని జైలు అధికారులు తెలిపారు. జైలు ప్రాంగణంలో నిరంతర ఆరోగ్య తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు నిరవధికంగా కొనసాగుతున్నాయని వివరించారు.

గుర్తు తెలియని వ్యక్తి మృతి

పర్లాకిమిడి: స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో (డీహెచ్‌హెచ్‌) గుర్తు తెలియని వ్యక్తి (40) మృతిచెందాడు. ఆ వ్యక్తి వివరాలు తెలిసిన వారు పోలీసుస్టేషన్‌కు సంప్రదించాలని ఆదర్శ పోలీసు స్టేషన్‌ ఐఐసీ ప్రశాంత భూపతి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement