పర్లాకిమిడి: మత్స్యకారులు చేపల పెంపకంలో మెలకువలు తెలుసుకోవాలని, ముఖ్యమంత్రి మత్స్యజీవి కల్యాణ యోజన పథకం ద్వారా లభిస్తున్న సబ్సిడీలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ముఖ్య ప్రాణి చికిత్స అధికారి తుషారేందు నాయక్ సూచించారు. స్థానిక జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాల్‌లో జాతీయ మత్స్యకారుల దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో ఒడిశా జీవికా మిషన్ అధికారి టిమోన్ బోరా, జిల్లా ముఖ్య వ్యవసాయ అధికారి ఎం.ప్రకాశరావు, ప్రభుత్వ మట్టి సంరక్షణ అధికారి సోనాలీ స్వయిని తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు పలువురు మత్స్యకారులకు పురస్కారాలు అందజేశారు.


