పర్లాకిమిడి: స్థానిక రాజవీధిలోని ఉమారామలింగేశ్వర ఆలయంలో ఉన్న శ్రీలలితా దేవి ఎనిమిదో వార్షికోత్సవాన్ని శనివరాం మహిళలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పైడిశెట్టి సుధ దంపతులు అమ్మవారికి ఘనంగా పూజలు జరిపించారు. ఆలయ పూజారి దుర్గా దాస్ పలువురు మహిళచే శ్రీలలితాదేవికి సహాస్ర నామావళి, కుంకుమ పూజలు జరిపించారు. సాయంత్రం అమ్మవారి తిరువీధి ఉత్సవం వైభవంగా జరిగింది. కార్యక్రమంలో విశాలాక్షి అయ్యంగర్, జోస్యుల ప్రదీప్ కుమార్ శర్మ పాల్గొన్నారు.
శ్రీలలితాదేవి అమ్మవారి పూజలు చేస్తున్న పైడిశెట్టి దంపతులు ఆశీర్వాచవచనం.


