జనజీవనం అస్తవ్యస్తం | - | Sakshi
Sakshi News home page

జనజీవనం అస్తవ్యస్తం

Jul 8 2026 1:26 AM | Updated on Jul 8 2026 1:26 AM

కొరాపుట్‌: భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. గత మూడు రోజులుగా కురిసిన వర్షం మంగళవారం తెరిపివ్వడంతో నష్టాలు వెలుగులోనకి వచ్చాయి. కొరాపుట్‌ జిల్లా పొట్టంగి నుంచి సుంకి మార్గం అధ్వానంగా మారింది. విశాఖపట్నం–రాయ్‌పూర్‌ జాతీయ రహదారి కావడంతో నిత్యం ఈ మార్గంలో వందలాది వాహనాలు ప్రయాణిస్తాయి. భారీ గోతులు ఏర్పడి గంటల తరబడి ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతుంది. నందపూర్‌లో భారీ చెట్టు నేల కులడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి చెట్టును తొలగించారు. భవానీపట్న మెయిన్‌ రోడ్డులో మరో చెట్టు కూలిపోవడంతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. కెంజోర్‌ జిల్లా టెల్కోయ్‌ ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. హనుమతియా కాలువలో తాత్కాలిక వంతెన కూలిపోయింది. ఈ వంతెన దాటడానికి ప్రయత్నం చేసిన ఏనుగు నీటిలో పడింది. వరద నీటిలో సురక్షితంగా ఒడ్డుకు చేరుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement