జయపురం: జయపురం సబ్‌డివిజన్ కుంధ్రా సమితిలో కొంత కాలంగా మహిళలు చేపట్టిన మదుముక్తి (మద్యం ముక్తి) ఆందోళన సోమవారం తారస్థాయికి చేరుకుంది. సోమవారం కుంధ్రా సమితి కార్యాలయంలో జన సునాణిలో పాల్గొనేందుకు కొరాపుట్ కలెక్టర్ మనోజ్ సత్యబాన్ మహాజన్ కుంధ్ర గ్రామానికి వచ్చారు.
కలెక్టర్‌ను చూసిన మధు ముక్తి మహిళా ఆంధోళన కారులు కర్రలు చేత పట్టి ఆయనను చుట్టు ముట్టారు. కొంత సమయం కలెక్టర్ ఆందోళనకారులకు వాగ్వాదం జరిగింది. మహిళలు దేశీ, విదేశీ మద్యం దుకాణాలను, బీహారీ సారాదుకాణాలను మూసి వేయాలని డిమాండ్ చేశారు. ఎట్టకేలకు కలెక్టర్ కుంధ్ర లోగల బిహారి సారా దుకాణానికి తాళాలు వేసి సీల్ వేయమని జయపురం సబ్ కలెక్టర్, కొరాపుట్ జిల్లా అబ్కారీ అధికారులను ఆదేశించారు.


