● స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో ఆయుర్వేదిక్ కళాశాల నిర్మిస్తామని రాష్ట్రఆరోగ్య, సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ గజపతి రాయగడ పర్యటనలో హామీ ఇచ్చారు. అయితే ఇప్పటివరకూ గజపతి జిల్లాలో కనీసం శంకుస్థాపన కూడా చేయలేదని పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి అన్నారు. ఈ విషయాన్ని మంగళవారం భువనేశ్వర్‌లో జరిగిన విధానసభ స్టాండింగ్ కమిటీ సమావేశంలో నిలదీశారు. అలాగే గజపతి జిల్లాలో కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలోని మెటర్నిటీ వార్డులో ఏసీలు, ఐసీయూ పనిచేయడం లేదని, జిల్లాలోని ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సుల పోస్టులు చాలా ఏళ్లుగా భర్తీ కాకుండా ఉన్నాయని ప్రస్తావించారు. రాష్ట్ర స్టాండింగ్ కమిటీ సమావేశానికి ఎమ్మెల్యే బిభూతీ భూషన్ ప్రధాన్ అధ్యక్షత వహించగా, శాసనసభ్యులు, స్టాండింగ్ కమిటీ సభ్యులు ప్రశాంత బెహారా, ఎమ్మెల్యే ఉమాచరణ్ మల్లిక్, ప్రకాష్ చంద్ర శెఠి, సుభాషిణీ జెన్నా, సత్యజిత్ గోమాంగో, స్వస్థ్య సెక్రటరీ పాల్గొన్నారు.


