సోషల్ మీడియా కలకలం
భువనేశ్వర్: పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేసిన ఆరోపణ కింద ఇటీవల ఇద్దరు యువకులను అరెస్టు చేసిన విషయం విదితమే. వీరిలో ఒకరు ఏకే 47 రైఫిల్ కలిగి ఉన్నట్లు ఆరోపణలు భగ్గుమన్నాయి. ఈ తుపాకీతో ఫేస్‌బుక్‌లో రైఫిల్‌తో ఉన్న నిందితుడి ఫొటో వైరల్ అవుతోంది. ఈ ప్రసారంతో వివాదం చెలరేగింది. పాకిస్తాన్‌తో సంబంధాలపై దర్యాప్తు జరపాలని ‘హిందూ సేన’ డిమాండ్ చేసింది.
రైల్వే అధికారులకు సత్కారం
భువనేశ్వర్: తూర్పు కోస్తా రైల్వే (ఈకోర్) జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్ నలుగురు రైల్వే ఉద్యోగులను వారి అత్యుత్తమ పనితీరు, అప్రమత్తతకు గుర్తించి సత్కరించారు. వారిలో ట్రాక్ మెయింటెయినర్ పూజన్ కుమార్ (టిట్లాగడ్), ట్రాక్ మెయింటెయినర్ దినేష్ కుమార్ (మటగజ్‌పూర్), లోకో పైలట్ జగదీష్ సమల్ ( కెందుఝొరొగొడొ), రైలు మేనేజర్ బొడ్డాని శ్రీనివాసరావు (విశాఖపట్నం) ఉన్నారు. వీరంతా దైనందిన విధుల నిర్వహణలో అసాధారణమైన అప్రమత్తతను ప్రదర్శించారు. ఈ అవార్డులను ప్రదానం చేస్తూ విధి నిర్వహణలో వారి నిబద్ధత, కృషిని తూర్పు కోస్తా రైల్వే (ఈకోర్) జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్ ప్రశంసించారు. ఆ నలుగురి అంకితభావం, అప్రమత్తతకు గుర్తింపుగా ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైలు సేవల భద్రత, విశ్వసనీయతను నిర్వహించడంలో ట్రాక్ మెయింటెయినర్లు, లోకో పైలెట్లు, టెక్నీషియన్లు, స్టేషన్ ఆపరేటర్లు వంటి ముందంజ సిబ్బంది కీలక పాత్రధారులుగా జనరల్ మేనేజర్ పేర్కొన్నారు.
నాటుసారా బట్టీలపై దాడులు
జయపురం: జయపురం సమితి గొడొపొదర్ ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో అక్రమంగా నాటుసారా తయారీ చేస్తున్న బట్టీలపై అబ్కారీ సిబ్బంది సోమవారం దాడులు జరిపారు. ఈ సందర్భంగా నాలుగు బటీలను ధ్వంసం చేసినట్టు జయపురం అబబ్కారీ విభాగ అధికారి సుబ్రత్ కేశరీ హిరన్ వెల్లడించారు. దాడుల్లో 50 లీటర్ల సారాతో పాటు సారా తయారు చేసేందుకు సిద్ధం చేసిన 600 లీటర్ల ఇప్ప ఊటను పట్టుకున్నామన్నారు. ధ్వంసంస చేసిన సారా, ఊట విలువ రూ. 50 వేలు ఉంటుందని వెల్లడించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పెట్రోలింగ్ జరుపుతున్న సమయంలో గొడొపొదర్ అడవిలో సారా తయారు చేస్తున్న సమాచారం విశ్వసనీయవర్గాల ద్వారా తెలియడంతో దాడలు చేశామన్నారు. తమను చూసిన సారా మాఫియా పరారైనట్టు వెల్లడించారు. సారా వంట సామగ్రిని సీజ్ చేసినట్లు చెప్పారు.
ఏనుగు కళేబరం లభ్యం
భువనేశ్వర్: కెంజొహర్ జిల్లా తెల్కోయ్ రేంజ్ తమాంగ్ అభయారణ్యంలో కుళ్లిన ఆడ ఏనుగు కళేబరాన్ని గుర్తించారు. దీని వయసు 20 ఏళ్లు ఉంటుందని భావిస్తున్నారు. పరీక్ష కోసం ఏనుగు కళేబరాన్ని ఆస్పత్రికి అధికారులు తరలించారు. ఈ నివేదిక ఆధారంగా మరణానికి కారణం తెలుస్తుందని అధికార వర్గాలు తెలిపాయి.
సోషల్ మీడియా కలకలం


