భయపడొద్దు..
శుక్రవారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 2025
భువనేశ్వర్: రాష్ట్రానికి కరోనా మహమ్మారి తిరిగొచ్చింది. గురువారం తొలి కరోనా కేసు నమోదైంది. రాజధాని నగరం భువనేశ్వర్‌కు చెందిన వ్యక్తికి కరోనా సోకింది. ఇతను ఇటీవలే ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాడు. ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. బాధితుడు ఇప్పటికే పలు వ్యాధులతో బాదపడుతున్నట్లు తెలిసింది. ఢిల్లీ నుంచి తిరిగొచ్చాక వైద్య పరీక్షలు చేయించుకోగా కోవిడ్ పాజిటివ్ అని తేలింది. కొత్త కరోనా కేసు వెలుగులోకి రావడంతో రాష్ట్ర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కరోనా సోకిన వ్యక్తి ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడని స్థానిక ఆరోగ్య శాఖ అధికారులు ధ్రువీకరించారు. అతని ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం సదరు వ్యక్తి ఆరోగ్యం బాగానే ఉందని, వైద్య సంరక్షణలో చికిత్స పొందుతున్నాడని చెప్పారు.
ప్రజారోగ్య శాఖ చర్యలు..
కోవిడ్ కేసు వెలుగుచూడటంతో స్థానిక ఆరోగ్య అధికారులు అప్రమత్తమయ్యారు. బాధితుడి సన్నిహితుల్లో ఎవరికై నా కరోనా లక్షణాలు ఉన్నాయో లేదో గుర్తించేందుకు ట్రేసింగ్ కార్యాచరణ అమలు చేస్తున్నారు. వ్యాప్తిని నివారించడానికి చర్యలు చేపడుతున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సైతం పౌరులను అప్రమత్తంగా ఉండాలని కోరింది. భద్రతా మార్గదర్శకాలను పాటించాలని విజ్ఞప్తి చేసింది. బయటకు వెళ్లేటప్పుడు మాస్క్‌లు ధరించాలని సూచించింది. చేతులు తరచూ శుభ్రపరుచుకుంటూ సామాజిక దూరం పాటించడం వల్ల కరోనా సంక్రమణను అరికట్టవచ్చని పేర్కొంది.
కదిలిన యంత్రాంగం..
కొత్త కోవిడ్ వైరస్ గుర్తింపుతో రాష్ట్ర ఆరోగ్య శాఖ యంత్రాంగం తక్షణ చర్యలకు నడుం బిగించింది. తొలి కేసు పూర్వాపరాలపై ఆరా తీసేందుకు సమగ్ర నివేదిక రూపకల్పన ప్రక్రియలో ఉన్నతాధికారులు నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ సమావేశమై కరోనా సంక్రమిత కదలిక, విస్తరణ, తీవ్రత అంశాలపై చర్చించారు.
న్యూస్‌రీల్
వాటర్‌షెడ్ విభాగంలో విజిలెన్స్ దాడులు
భువనేశ్వర్‌లో తొలి కేసు నమోదు
ఢిల్లీ నుంచి తిరిగొచ్చాక నిర్వహించిన వైద్యపరీక్షల్లో పాజిటివ్‌గా గుర్తింపు
ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు
అప్రమతమైన అధికార యంత్రాంగం
నగరంలో కరోనా పీడితుని గుర్తింపు ప్రజల్ని కలవరపరుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఏమాత్రం భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు, నగర మేయర్ అన్నారు. గురువారం భువనేశ్వర్‌లో కోవిడ్ కేసు నమోదైన నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ కమిషనర్, కార్యదర్శి ఎస్.అశ్వత్థి విలేకరులతో మాట్లాడారు. దేశం నుండి కోవిడ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోలేదని, ఈ వ్యాధికి సంబంధించిన కేసులు ఇప్పటికీ అక్కడక్కడా తారసపడుతున్నాయని చెప్పారు. రాజధాని నగరంలో తాజాగా నమోదైన కోవిడ్ కేసు తక్కువ తీవ్రతతో కూడుకున్నదని తెలిపారు.కోవిడ్ బారిన పడిన వ్యక్తి ఇతర వ్యాధులతో దీర్ఘకాలంగా చికిత్స పొందుతున్నాడని,. అతను కోవిడ్ ద్వారా మాత్రమే ప్రభావితమైనట్లు పరిగణించేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ కోవిడ్ పరిస్థితిని తీక్షణంగా పర్యవేక్షిస్తోందని చెప్పారు. ఇదే విషయాన్ని స్థానిక నగర పాలక సంస్థ బీఎంసీ మేయర్ సులోచనా దాస్ పేర్కొన్నారు. ప్రజలు ధైర్యంగా ఉండాలని కోరారు.
భయపడొద్దు..
భయపడొద్దు..
భయపడొద్దు..


