
సారా స్థావరాలపై దాడులు
పాతపట్నం: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో అక్రమంగా నిర్వహిస్తున్న సారా తయారీ స్థావరాలపై ఆంధ్ర, ఒడిశా ఎకై ్సజ్ అధికారులు సంయుక్తంగా శుక్రవారం దాడులు నిర్వహించారు. పాతపట్నం, కొత్తూరు మండలాలకు అనుకు ని ఉన్న ఒడిశా గ్రామాలైన సింగుపూర్, శిరడా, గురిసింగి గూడ, నేరడి గూడ పరిసరాల్లో 1,120 లీటర్ల నాటు సారా, 10,600 లీటర్ల తయారీకి సిద్ధంగా ఉంచిన పులియబెట్టిన బెల్లపు ఊటలను గుర్తించి ధ్వంసం చేసి, భారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పాతపట్నం ఎకై ్సజ్ సీఐ కె.కృష్ణారావు తెలిపారు.
మలేరియాపై అవగాహన ర్యాలీ
అరసవల్లి: మలేరియాను జయించండి.. జీవితం నిలపండి అని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ అనిత పిలుపునిచ్చారు. ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక డీఎంహెచ్‌ఓ కార్యాలయం నుంచి ఏడు రోడ్ల కూడలి వరకు నిర్వహించిన ర్యాలీని ఆమె లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మలేరియాను సరైన జాగ్రత్తలు పాటించి నివారించుకోవచ్చునని, గత ఐదేళ్లలో మలేరియా కేసులు బాగా తగ్గుముఖం పట్టాయన్నారు. అయితే ప్రతి ఇంట్లో పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవడాన్ని ప్రథమ కర్తవ్యంగా మారుచకోవాలని సూచించారు. అనంతరం ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వైద్యశాఖ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి సత్యన్నారాయణ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ మేరీ కేథరిన్, అడిషినల్ డీఎంహెచ్‌ఓ తాడేల శ్రీకాంత్, ప్రోగ్రాం కన్సల్టెన్సీ శ్రీకాంత్ పాల్గొన్నారు.
అరసవల్లి ఇన్‌చార్జి ఈఓగా శోభారాణి
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ ఇన్‌చార్జి ఈఓగా కె.శోభారాణిని నియమించారు. ఈ మేరకు దేవదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె విశాఖ కనక మహాలక్ష్మి ఆలయంలో ఈఓగా పనిచేస్తూ.. అరసవల్లి ఇన్‌చార్జి బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇప్పటివరకు ఉన్న ఈఓ వై.భద్రాది మెడికల్ లీవులో వెళ్లినందున జిల్లా దేవదాయ శాఖ అధికారి(ఏసీ)తో పాటు అరసవల్లి ఆలయ ఈఓ బాధ్యతలు కూడా శోభారాణి చూడనున్నారు.
వంశధార నిర్వాసితులకు స్పెషల్ ప్యాకేజీ హామీ ఏమైంది?
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): వంశధార నిర్వాసితులకు స్పెషల్ ప్యాకేజీ ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు మాట నిలబెట్టుకోవాలని ప్రాజెక్టుల నిర్వాసితుల సంఘం రాష్ట్ర కార్యదర్శి గంగరాపు సింహాచలం డిమాండ్ చేశారు. ఈ మేర కు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా కొత్తూరు మండల కేంద్రంలో నిర్వాసితుల ఉద్దేశించి మాట్లాడారని, టీడీపీ అధికారంలోకి వస్తే నిర్వాసితులందరికీ స్పెషల్ ప్యాకేజీ ఇప్పిస్తానని చంద్రబాబు ఇచ్చిన హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. గతంలో మీ మాటలు నమ్మి మోసపోయిన ప్రజలు మళ్లీ గంపెడు ఆశలతో మీ ప్రభుత్వాన్ని గెలిపించారని అధికారంలోకి వచ్చి సంవత్సర కా లం కావస్తున్నా నిర్వాసితులకు ఇచ్చిన హామీ ఏమైందో తెలియడం లేదన్నారు.
‘ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందే’
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): జిల్లాకు ప్రత్యేకంగా ఎన్నికల ముందు చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారని, వాటిలో ఒక్కటి కూడా అమలుచేయలేదని, ఇప్పుడైనా అమలు చేయాలని సీపీ ఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్య దర్శి వర్గ సభ్యులు కె.మోహనరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఐటీయూ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏను ఏర్పాటు చేస్తామని, జీడికి గిట్టుబాటు ధర కల్పిస్తామని, జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, వంశధార నిర్వాసితులకు స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి ఆదుకుంటామన్న హామీలు నేటికీ నెరవేర్చలేదని గుర్తు చేశారు. జిల్లాలో ఫిషింగ్ హార్బర్స్ నిర్మాణం చేపట్టాలని, కోల్డ్ స్టోరేజీ నిర్మాణం చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి త్వరగా పూర్తి చేయాలన్నారు. గొట్టా బ్యారేజ్ నిర్మాణం చేసి 50 ఏళ్లు పూర్తి కావస్తోందని ఆధునికీకరణకు రూ. 1600 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. 2007లో ప్రారంభించిన ఆఫ్‌షోర్ రిజర్వాయర్‌కు నిధులు కేటాయించకపోవడంతో ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయని రిజర్వాయర్‌కు నిధులు కేటాయించాలన్నారు.

సారా స్థావరాలపై దాడులు