భక్తులపై తేనెటీగల దాడి | - | Sakshi
Sakshi News home page

భక్తులపై తేనెటీగల దాడి

Apr 16 2025 12:59 AM | Updated on Apr 16 2025 12:59 AM

భక్తు

భక్తులపై తేనెటీగల దాడి

కొరాపుట్‌: తేనెటీగలపై కోతుల దాడి చేయడంతో అవి చెలరేగి భక్తులపై దాడి చేశాయి. మంగళవారం సాయంత్రం కొరాపుట్‌ జిల్లా బొయిపరిగుడ సమితి కేంద్రం సమీపంలోని అటవీ ప్రాంతంలో భీర్‌కంభ అమ్మవారి దేవాలయంలో జాతర జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. ఇక్కడకు సమీపంలో ఉన్న తేనె పట్టులపై కోతులు దాడి చేశాయి. దీంతో తేనె తుట్ట కదిలి తేనెటీగలన్నీ భక్తులపై దాడి చేశాయి. సుమారు 30 మందికి తీవ్ర గాయాలు కాగా.. వారిని బొయిపరిగుడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. దేవాలయ పూజారి కృష్ణ నాయక్‌, నబరంగ్‌పూర్‌ జిల్లాకి చెందిన అశ్విని పట్నాయక్‌ అనే బాలుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు.

భక్తులపై తేనెటీగల దాడి 1
1/3

భక్తులపై తేనెటీగల దాడి

భక్తులపై తేనెటీగల దాడి 2
2/3

భక్తులపై తేనెటీగల దాడి

భక్తులపై తేనెటీగల దాడి 3
3/3

భక్తులపై తేనెటీగల దాడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement