హ్యాకథాన్ పోటీల్లో లక్ష్మీపురం విద్యార్థుల సత్తా
రేగిడి: మండలంలోని లక్ష్మీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఇటీవల రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఆమెజాన్ ప్యూచర్ ఇంజనీర్ హ్యాక్‌థాన్ పోటీల్లో ప్రతిభ కనబరిచారు. విశాఖపట్నంలోని హోటల్ గ్రీన్‌పార్క్‌లో నిర్వహించిన పోటీల్లో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన 27 మంది విద్యార్థులు పాల్గొనగా.. లక్ష్మీపురం ఉన్నత పాఠశాలకు చెందిన రేగిడి పూర్ణిమ, తోట నిహారిక, బిందు మాధవి (8వ తరగతి) రాష్ట్ర స్థాయిలో తృతీయ బహుమతి సాధించారు. దీంతో అమెజాన్ సంస్థ పాఠశాలకు ఒక టీవీ, రెండు ల్యాప్‌టాప్‌లు, రెండు ట్యాబ్‌లు పంపించింది. ఈ మేరకు విద్యార్థులను పాఠశాల ఆవరణలో ఆదివారం అభినందించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం ఎం. కృష్ణారావు, ఎంఈఓ ఎంవీ ప్రసాదరావు, బి.ఎరకయ్య, సర్పంచ్ కెంబూరు వెంకటేశ్వరరావు, పీఎంసీ చైర్‌పర్సన్ కర్నేన రమాదేవి, తదితరులు అభినందించారు.


