జలాశయంలో రొయ్య పిల్లల విడుదల
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి జలాశయంలో నాలుగు లక్షల రొయ్య పిల్లలను చిత్రకొండ ఎమ్మెల్యే మంగుఖీలో సమక్షంలో మత్స్యశాఖాధికారులు సోమవారం విడుదల చేశారు. జిల్లా మత్స్యశాఖ అధికారి సుశాంత్ గౌడ పర్యవేణలో తొలిదశగా నాలుగు లక్షల రొయ్య పిల్లలను జలాశయంలో విడుదల చేశామన్నారు. భవిష్యత్‌లో మరో 13 లక్షల పిల్లలను విడిచిపెట్టే అవకాశం ఉందన్నారు. ఎమ్మెల్యే మంగు మాట్లాడుతూ.. చేపల ఉత్పతులు, మార్కెటింగ్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందన్నారు. జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సమారి టంగులు, చిత్రకొండ సమితి అధ్యక్షురాలు రాజేశ్వరి ఖీలో, సమితి సభ్యుడు రాజకమల్ పురోహిత్ ఉన్నారు.
రూ.3 కోట్ల నిధులు మంజూరు
పర్లాకిమిడి: ఉత్కళ దివాస్ సందర్భంగా ప్రజలందరికీ పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పర్లాకిమిడి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు రూ.3 కోట్లు ఎమ్మెల్యే లాడ్ నిధులను సోమవారం మంజూరు చేశారు. స్థానిక రాంనగర్ హైటెక్ ప్లాజాలో జరిపిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. పర్లాకిమిడి జగన్నాథ మందిరం పునః నిర్మాణ పనులకు ఎమ్మెల్యే లాడ్ నిధుల నుంచి రూ.50 లక్షలు, పట్నాయక్ చెరువు అభివృద్ధి పనులకు రూ.6లక్షలు, మహేంద్ర తనయ వద్ద శ్మశాన వాటిక నిర్మాణానికి రూ.5లక్షలు మంజూరు చేశారు. గుసాని సమితిలో పలు గ్రామాలకు రూ.1.15 కోట్లు, కాశీనగర్ సమితిలో పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు రూ.56 లక్షలు, గుమ్మా సమితికి తొలి పర్యాయం రూ.15 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు.
నబరంగ్‌పూర్‌లో హైకోర్టు జడ్జి పర్యటన
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లాలో హైకోర్టు న్యాయమూర్తి చిత్తరంజన్ దాస్ సోమ వారం పర్యటించారు. జిల్లా కేంద్రంలోని సర్క్యూట్ హౌస్‌కి చేరుకున్నారు. అక్కడ జిల్లా బార్ అసోసియేషన్ ప్రతినిధులు సిరాజుద్దీన్ అహ్మద్, సీనియర్ న్యాయవాదులు జడేశ్వర్ ఖడంగా, సి.హెచ్.బాబా యుగంధర్ తదితరులు ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ శుభంకర్ మహాపాత్రో భేటీ అయ్యారు. జిల్లా కోర్టుల సముదాయాన్ని సందర్శించారు. సాయంత్రం శక్తిపీఠం బండారు ఘరణి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. రాజ పురోహితుడు నర్సింగ త్రిపాఠి స్వాగతం పలికారు.
నేడు రాష్ట్ర అవతరణ దినోత్సవం
పర్లాకిమిడి: ఈ నెల 1వ తేదీన ఒడిశా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు, ఉత్కళ దివాస్ సందర్భంగా రాష్ట్ర వాణిజ్య, వైద్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ మంగళవారం పర్లాకిమిడి రానున్నారు. ఉత్కళ దివాస్ వేడుకల్లో పాల్గొనున్నట్టు కలెక్టర్ సోమవారం తెలియజేశారు. పట్టణంలోని పురపాలక, కలెక్టరేట్, రెవెన్యూ శాఖ, ఆర్టీఓ, ప్రభుత్వ బ్యాంకులను విద్యుత్ వెలుగులతో తీర్చిదిద్దారు. పర్లాకిమిడిలో మహారాజా కృష్ణచంద్రగజపతి నారాయణ దేవ్ ఘాట్ వద్ద మంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్, అధికారులు నివాళులర్పించనున్నారు.
బుడితిలో బంగారం చోరీ
సారవకోట: మండలంలోని బుడితి గ్రామంలో మూడు తులాల బంగారం చోరీకి గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుడితి గ్రామానికి చెందిన శిమ్మ రామారావు దంపతులు ఆదివారం హైదరాబాద్‌లో బంధువుల ఇంటికి వెళ్లారు. సోమవారం ఉదయం ఇంటి పనిమనిషి నాగమ్మ అటువైపుగా వెళ్లగా తలుపులు పగలగొట్టి ఉండటాన్ని గమనించింది. వెంటనే ఇంటి యజమానికి ఫోన్‌లో సమాచారం అందించింది. వారు నరసన్నపేటలో నివాసం ఉంటున్న రామారావు అల్లుడైన గిరీష్‌కుమార్‌కు సమాచారం ఇవ్వగా ఆయన స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రెండు తులాల చైన్, అర తులం బరువైన రెండు ఉంగరాలు చోరీకి గురైనట్లు పేర్కొన్నారు. ఎస్‌ఐ అనిల్‌కుమార్ కేసు నమోదు చేసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ గ్రామంలో ఎనిమిది నెలల వ్యవధిలో నాలుగు దొంగతనాలు జరగడం గమనార్హం.
జలాశయంలో రొయ్య పిల్లల విడుదల
జలాశయంలో రొయ్య పిల్లల విడుదల
జలాశయంలో రొయ్య పిల్లల విడుదల


