రాయగడ: స్థానిక రామకృష్ణనగర్‌లో మంగళవారం అర్థరాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఒక ఇంట్లో చొరబడి బీరువాలను విరగ్గొట్టి బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదును దొంగిలించినట్లు బాధితుడు సదరు పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు రామకృష్ణనగర్ పోస్టాఫీసు వీధిలో నివాసముంటున్న చంద్రమౌళి ప్రసాద్ బెహర అనే వ్యక్తి కొరాపుట్ వేళ్లేందుకు మంగళవారం రాత్రి ఒంటిగంట సమయంలో నిద్రలేచి చూసేసరికి ఇంటి బయట ఎవరో ఉన్నట్లు గమనించాడు. దీంతో బయటకు వెళ్లి చూసి తిరిగి ఇంటి లోపలకి వెళ్లిపోయాడు. కొద్దిసేపు తర్వాత మరింత శబ్ధం వినిపించడంతో బయటకువచ్చి చూడగా తమ కింది ఇంటి తలుపులు తెరిచి ఉండడం గమనించాడు. అప్పుడు ఇంటి లోపలికి వెళ్లి చూడగా ఇంట్లోని రెండు బీరువాలు, వస్తువులు చిందరవందరగా పడి ఉండడం గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎంత మొత్తం బంగారు ఆభరణాలు, నగదు దొంగిలించారు అనేది తెలియలేదు.
రాజధానికి కాంగ్రెస్ శ్రేణులు
కొరాపుట్: ప్రదేశ్ కాంగ్రెస్ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాజధాని భువనేశ్వర్‌కు బుధవారం కొరాపుట్ జిల్లా సిమిలిగుడ నుంచి ప్రత్యేక బస్సుల్లో బయల్దేరారు. మరోవైపు నబరంగ్‌పూర్ జిల్లా నుంచి పిసిసి మాజీ ఉపాధ్యక్షుడు మున్నా త్రిపాఠి నేతృత్వం కాంగ్రెస్ కార్యకర్తలు బయల్దేరారు. గురువారం అసెంబ్లీ ముట్టడి కార్యాక్రమంలో వీరు పాల్గోనున్నారు.
రామకృష్ణనగర్‌లో చోరీ
రామకృష్ణనగర్‌లో చోరీ


