
కవిటిలో అంతర్రాష్ట్ర నాటిక పోటీలు
కవిటి: సమాజంలో పేదల జీవితాలకు సవాళ్లు విసురుతున్న సమస్యలు, పాశ్చాత్య పెడధోరణులే ఇతివృత్తాలుగా తెరకెక్కించిన జనరల్ బోగీలు, నిశ్శబ్ధమా నీ ఖరీదెంత? నాటికలు ఆద్యంతం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాయి. గుంటూరు జిల్లా కొలకలూరుకు చెందిన సాయిఆర్ట్స్ బ్యానర్‌పై ప్రదర్శితమైన ‘జనరల్ బోగీలు’ నాటిక నేటి భారతీయ రైల్వే ప్రయాణీకుల కష్టాలకు సాక్షీభూతంగా నిలిచింది. అనంతరం ప్రదర్శితమైన నిశ్శబ్ధమా నీ ఖరీదెంత నాటిక? సైతం పాశ్చాత్య పెడధోరణిలో పెళ్లి చేసుకుని పిల్లలతో ఉన్న వ్యక్తులు వేరొక వ్యక్తితో సహజీవనం చేయడంపై ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం ఓ కేసులో ఇచ్చిన తీర్పు(498 ఏ ఐపీసీ)ను కొందరు పురుషులు, మహిళలు ఏవిధంగా దుర్వినియోగం చేస్తున్నారు అనే ఇతివృత్తంతో సాగింది. అంతకుముందు కళాపరిషత్ పోటీలను కళ్యాణీ గ్రూప్ సంస్థల అధినేత లోళ్ల రాజేష్, సర్పంచ్ బి.శ్రీరాంప్రసాద్, బి.లక్ష్మణమూర్తి జ్యోతి ప్రజ్వలనచేసి ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment