‘రక్తదానం మహాదానం’
జయపురం: బ్లడ్‌బ్యాంకుల్లో రక్తం కొరత పెరుగుతోందని, యువత ముందుకువచ్చిన రక్తదానం చేయాలని జిల్లా కేంద్రాస్పత్రి వైద్య నిపుణురాలు డాక్టర్ సస్మిత దాస్ పిలుపు నిచ్చారు. స్థానిక ప్రసాదరావు పేటలో గల పతంజలి యోగ కేంద్రం వారి కమ్యూనిటీ కేంద్రంలో సోమవారం నిర్వహించిన స్వచ్ఛంద రక్తదాన శిబిరంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జగన్నాథునికి పూజ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ రక్త దానం మహత్తరమైనదని, ఒకరు దానం చేసిన రక్తం మరో ప్రాణాన్ని కాపాడుతుందని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు, గర్భిణులకు సకాలంలో రక్తం అందాలంటే దాతలు రక్త దానం చేయాలని విజ్ఞప్తి చేశారు. శిబిరంలో 15 యూనిట్ల రక్తం సేకరించారు. శిబిరంలో యోగ కేంద్రం శిక్షకురాలు సుప్రభ రౌళో ముందుగా రక్త దానం చేసి రక్త దాతలను ఉత్సాహ పరిచారు. శిబిరంలో ఏఎస్‌ఆర్ యోగ ప్రసార గ్రూపు సభ్యులు డాక్టర్ సుదాంశు పట్నాయిక్, జయపురం సబ్‌డివిజన్ రక్తదాతల మోటివేటెడ్ అసోసియేషన్ కార్యదర్శి ప్రమోద్ కుమార్ రౌళో తదితరులు రక్తదాన శిబిరాన్ని పర్యవేక్షించారు.
‘రక్తదానం మహాదానం’
‘రక్తదానం మహాదానం’


