మిల్లర్ల సంఘం అధ్యక్షుడిగా కనుదాస్
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడిగా మానస్ రంజన్ దాస్ (కను) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా మిల్లర్ల సంఘం సర్వసభ్య సమావేశంలో మిల్లర్లు కనుదాస్‌ని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. అనంతరం ప్రభుత్వ అధికారులను కలిసి కను ఎన్నికను తెలియజేశారు. బీజేపీకి చెందిన కను ప్రస్తుతం నబరంగ్‌పూర్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా, మంగళం టింబర్ పరిశ్రమ దినసరి కార్మి కుల సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
ఆటో బోల్తాపడి ఒకరు మృతి
రాయగడ: జిల్లాలోని బిసంకటక్ సమితి పాయికొడాకులుగుడ గ్రామ సమీపంలో ఆటో బోల్తాపడిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రగాయాల పాలయ్యారు. సోమవారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించగా, గాయపడిన వ్యక్తిని బిసంకటక్ క్రిస్టియన్ హాస్పిటల్‌కు చికిత్స కోసం తరలించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం హటొమునిగుడ నుంచి ఆటో రిక్షా పాయికొడాకులుగుడకు వస్తున్న సమయంలో డాకులగుడ నది సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో కూర్చున్న కృష్ణ తొయిక (24) సంఘటన స్థలం వద్దే మృతి చెందగా, డ్రైవర్ రమేష్ తొయిక గాయాలతో బయటపడ్డాడు.
టూరిస్టు బస్సుకు ప్రమాదం
● 6 మందికి గాయాలు
భువనేశ్వర్: భువనేశ్వర్ – పూరీ జాతీయ రహదారిపై తేయిసీపూర్ కూడలి సమీపంలో టూరిస్ట్ బస్సు ప్రమాదానికి గురైంది. మధ్యప్రదేశ్ నుంచి వస్తుండగా టూరిస్ట్ బస్సు విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో 6 మంది మహిళా పర్యాటకులు తీవ్రంగా గాయపడ్డారు. పూరీ శ్రీజగన్నాథుని దర్శనం కోసం మధ్యప్రదేశ్ నుంచి 20 మంది ప్రయాణికులతో బయల్దేరిన బస్సు దుర్ఘటనకు గురైంది.
సైబర్ వలలో ప్రభుత్వ ఉద్యోగి
మల్కన్‌గిరి: సైబర్ నేరగాళ్లు రోజుకొక వ్యూహంతో సామాన్యుల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వరకు దోచుకుంటున్నారు. తాజాగా కలిమెల సమితి ఎంవీ 79 గ్రామంలో ఉన్న జల వనరుల శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగి శ్రీకాంత్ బెహరా సైబర్ మోసానికి బలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. ఈనెల 2వ తేదీన శ్రీకాంత్ బెహరాకు తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చింది. లిఫ్ట్ చేసి ఎవరని అడగగా అదే ఆఫీస్‌లో పనిచేస్తున్న అకౌంటెంట్ అని చెప్పి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఫోన్‌లో మాటలు అచ్చం అకౌంటెంట్ మాటలు మాదిరిగా ఉండడంతో శ్రీకాంత్ నమ్మాడు. అనంతరం తనకు అవసరమని చెప్పి రూ.95 వేలు అడిగాడు. తన అకౌంట్‌లోకి డబ్బులు రావడం లేదని చెప్పి, వేరు నంబర్ ఇచ్చి వేయమని చెప్పాడు. దీంతో అతనిపై నమ్మకంతో శ్రీకాంత్ మొదట రూ.50 వేలు, రెండోసారి రూ.45 వేలు పంపించాడు. అనంతరం కాల్ వచ్చిన నంబర్‌కు తిరిగి కాల్ చేయగా లిఫ్ట్ చేయకపోవడంతో మోసపోయానని గుర్తించి, వెంటనే ఎంవీ 79 పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఐఐసీ చంద్రకాంత్ తండి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మిల్లర్ల సంఘం అధ్యక్షుడిగా కనుదాస్
మిల్లర్ల సంఘం అధ్యక్షుడిగా కనుదాస్
మిల్లర్ల సంఘం అధ్యక్షుడిగా కనుదాస్


