మణిపూర్‌లో కొరాపుట్ ఎంపీ పర్యటన
కొరాపుట్: కొరాపుట్ పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు సప్తగిరి ఉల్క మణిపూర్ రాష్ట్రంలో బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్రంలో మత ఘర్షణల బాధితుల శిబిరాలను శిబిరాలు సందర్శించారు. వారికి జరిగిన నష్టం, కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని భరోసా ఇచ్చారు. వారి సమస్యలను పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తునాని ప్రకటించారు. మణిపూర్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కె.మేఘచంద్ర సింగ్‌తో కలసి అకంపట్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో తెలుసుకున్న బాధితుల సమస్యలు మీడియాకి వివరించారు. చుర్చానందపూర్‌లో ఐడీబీ క్యాంప్‌లో బాధితుల జీవితాలు దయనీయంగా ఉన్నాయన్నారు. ఘర్షణలు జరిగి నెలలు గడుస్తున్నప్పటికీ బాధితులు ఇంకా స్వస్థలాలకు చేరుకోలేదన్నారు. ఇది మోదీ ప్రభుత్వ వైఫల్యంగా అభివర్ణించారు. అనంతరం అక్కడ ఎంఆర్‌ఎన్‌ఆర్‌ఈజీఎ పథకం బచావో ఆందోళనలో పాల్గొన్నారు. ఉల్క ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఈశాన్య రాష్ట్రాల పరిశీలకుడిగా వ్యవహరిస్తున్నారు.
మణిపూర్‌లో కొరాపుట్ ఎంపీ పర్యటన
మణిపూర్‌లో కొరాపుట్ ఎంపీ పర్యటన


